నిన్నుకోరి వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫ్యామిలి ఎంటర్టైనర్ టక్ జగదీష్. అన్ని రకాల కమర్షియల్ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ రోజు ఉగాది సందర్భంగా అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టక్ జగదీష్ ఫ్యామిలీ అంతా కలిసి ఆనందంగా ఉన్న ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
కరోనా వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదల తేది వాయిదా పడినట్లు వీడియో ద్వారా వివరించారు నేచురల్ స్టార్ నాని.. ``టక్ జగదీష్ కుటుంబమంతా కలిసి చూసే సినిమా.. అలాంటి సినిమాను ఫ్యామిలీస్ కలిసి చూస్తేనే మజా వస్తుంది.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ డేట్ కూడా మారిపోయింది, అంతేకాదు ఉగాదికి రావాల్సిన ట్రైలర్ కూడా వాయిదా పడిందని ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో..అప్పుడే కొత్త విడుదల తేదీ కూడా అందులోనే ఉంటుందని తెలిపారు న్యాచురల్ స్టార్ నాని.