Advertisementt

రాజీవ్ సాలూర్ కొత్త చిత్రం.!

Tue 13th Apr 2021 05:48 PM
rajiv salur new movie  రాజీవ్ సాలూర్ కొత్త చిత్రం.!
Rajiv Salur new movie.! రాజీవ్ సాలూర్ కొత్త చిత్రం.!
Advertisement
Ads by CJ

ఉగాది సందర్భంగా పూజ కార్యక్రమాలతో మొదలైన రాజీవ్ సాలూర్ కొత్త చిత్రం..!

వెరైటీ చిత్రాలతో ఆకట్టుకున్న రాజీవ్ సాలూర్ కొత్త చిత్రం ఉగాది పండుగను పురస్కరించుకుని పూజ కార్యక్రమాలతో మొదలైంది. వర్ష హీరోయిన్ గా నటిస్తుంది.  ఆర్కే నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ని ఎస్.ఆర్.కె బ్యానర్ పతాకంపై శివ రామ కృష్ణ జి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సత్య సిరికి ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. సంతోష్ సనమోని సినిమా అందిస్తుండగా, రోషన్ సంగీతం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత శ్రీ నట్టి కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు గారు క్లాప్ కొట్టారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివ రామ కృష్ణ జి మాట్లాడుతూ.. ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రారంభించుకున్న ఈ సినిమా ఎంతో వెరైటీ గా రాబోతుంది. దర్శకుడు ఆర్కే నల్లూరి చెప్పిన కథ బాగుంది.. కథ అనుకున్నప్పుడే రాజీవి సాలూర్ హీరోగా చేయాలనీ డిసైడ్ అయ్యాము.. ఈ సినిమా మా అందరికి మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశిస్తున్నాము.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు..

దర్శకుడు ఆర్కే నల్లూరి మాట్లాడుతూ.. ఈ కథ వినగానే సినిమా చేయడానికి  ఒప్పుకున్న ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు.. అందరిని మెప్పించే సినిమా అవుతుంది.. త్వరలోనే ఓ మంచి సినిమా మీముందుకు తీసుకొస్తాం.. హీరో రాజీవ్ సాలూర్ ఈ సినిమా ని ఒప్పుకోవడం ఆనందంగా ఉంది అన్నారు..

హీరో రాజీవి సాలూరి మాట్లాడుతూ.. కథ వినగానే సినిమా చేయాలనీ ఎంతో ఇంట్రెస్ట్ వచ్చింది. కథలో చాలా మలుపులు ఉన్నాయి..దర్శకుడు చెప్పిన విధానం బాగుంది.. నన్ను హీరోగా ఎంపిక చేసినందుకు నిర్మాత శివ రామ కృష్ణ జి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

Rajiv Salur new movie.!:

Rajiv Salur new movie.!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ