ఆసక్తి రేపుతున్న సన్ అఫ్ ఇండియా పోస్టర్
భిన్న విభిన్న పాత్రలతో, విలక్షణ కథాంశాలతో అంతులేని విజయాలను కైవశం చేసుకుని, తనకంటూ తెలుగు సినీ చరిత్రలో అపురూపమైన కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని పదిలపరచుకున్న కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రస్తుతం సన్ అఫ్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యధిక అంచనాలతో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ ఫిల్మ్ పోస్టర్ ని ఉగాది పర్వదినం సందర్భంగా మీడియాకి విడుదల చేశారు చిత్ర నిర్మాత విష్ణు మంచు. 24 ఫ్రేమ్స్ పతాకంపై విష్ణు మంచు నిర్మిస్తున్న సంచలన చిత్రం పైన అల్లుకున్న అంచనాలను ఈనాడు విడుదల చేసిన పోస్టర్ పదింతలు చేసింది. ప్రస్తుతం సన్ అఫ్ ఇండియా చిత్రం గురించి కీలకమైన వివరాలు వెల్లడి కాలేదు. అయినా సరే.. డాక్టర్ మోహన్ బాబు మార్క్ సూపర్ పెర్ఫార్మెన్స్, డైలాగులు అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోబోతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏ కథనీ, ఏ పాత్రనీ అంతతొందరగా అంగీకరించని మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా చిత్ర కథ ని చెయ్యాలని అనుకోవడం తోనే ఈ ప్రాజెక్టుకు ఎంతో క్రేజ్, డిమాండ్ ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగా నే ఈరోజు విడుదలైన పోస్టర్ కూడా మరింత ఉత్కంఠ రేపుతోంది.