యూత్ స్టార్ నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నితిన్ 30వ చిత్రం ‘మాస్ట్రో’. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీరామ నవమి శుభాకాంక్షలతో మాస్ట్రో మూవీ నుంచి సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. నభా నటేష్ స్కూటీ నడుపుతూ ఉండగా.. నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు. కలర్ ఫుల్‌గా ఉన్న ఈ రొమాంటిక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
తమన్నా భాటియా కీలక పాత్రలో నటిస్తోన్న ‘మాస్ట్రో’ 2021లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి. ఇటీవల రంగ్‌దే సినిమాతో విజయం సాధించారు హీరో నితిన్. ఈ చిత్రంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ తమన్నా భాటియా, నభా నటేష్ భాగమవుతున్నారు. ‘భీష్మ’ మూవీకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికీ సుమధుర బాణీలను సమకూరుస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.