కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది..కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఇదే డైలాగ్ వినిపిస్తుంది. ఈ డైలాగ్ అంత పాపులర్ అవడమే కాకుండా సింహా, లెజెండ్వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచింది. ఉగాది సందర్భంగా ఏప్రిల్13న మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో అఖండ టీజర్ విడుదలై యూట్యూబ్‌లో అపూర్వ ఆదరణతో దూసుకెళ్తూ కేవలం 16రోజుల్లోనే 50మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియన్స్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ ఇంతటి అఖండ విజయానికి కారణమైన అభిమానులకు, ఆదరించిన ప్రతి ఒక్కరికి అఖండ యూనిట్ అభినందనలు తెలుపుతోంది. ఈ సందర్భంగా..
చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ - సింహా, లెజెండ్ తర్వాత బాలయ్యగారితో చేస్తున్నఅఖండ సినిమాపై ప్రేక్షకులకు, అభిమానులకు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాటికి ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. బాలయ్య నటవిశ్వరూపాన్నిఈ సినిమాలో మరోసారి చూస్తారు. అతి తక్కువ రోజుల్లోనే 50మిలియన్ వ్యూస్ క్రాస్ చేసే స్థాయిలో అఖండ టైటిల్ రోర్‌ని ఇంత అఖండంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి, అభిమానులకి హృదయపూర్వక దన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ - మా మూవీ ఫస్ట్ రోర్ విడుదలైన దగ్గర నుండి సినిమాపై మంచి అంఛనాలు ఉన్నాయి. ఇప్పుడు అఖండ టైటిల్ రోర్‌తో ప్రేక్షకులలో, అభిమానుల్లో ఆ అంఛనాలు రెట్టింపు అయ్యాయి. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకునేలా బోయపాటిగారు ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అఖండ టైటిల్ రోర్ ప్రేక్షకుల, అభిమానుల ఆదరణతో 50మిలియన్ల వ్యూస్ దాటి మరిన్ని రికార్డ్స్ సృష్టిస్తుందని ఆశిస్తున్నాను. మా ద్వారక క్రియేషన్స్ బేనర్‌లో అఖండ తప్పకుండా ఒక ప్రస్టేజియస్ మూవీగా నిలుస్తుంది. బాలయ్యబాబు, బోయపాటి గార్ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న అఖండ నందమూరి అభిమానుల్లో పండగ తీసుకొస్తుంది. ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం అన్నారు.