2021లో రిలీజ్ అయిన సినిమాల్లో నాంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు విజయ్ కనకమేడల కూడా అందరి దర్శకులలో ఒకడిలా కాకుండా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నాంది సక్సస్ తో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుండి అవకాశాల వెతుకుంటూ వస్తున్నవి.
సక్సస్ లు లేని అల్లరి నరేష్ లాంటి వారితో సినిమా తీసి, పెద్ద హిట్ కొట్టాడు.అలాగే మనిషి చిన్న వాడే గాని, మనస్సులో చాలా పెద్ద వాడు.
మూవీ రిలీజ్ అయ్యి, హిట్ కొట్టాక, తన టీం మెంబెర్స్ కి నాంది పేరుతో ౩లక్షల విలువ చేసే గోల్డ్ లాకెట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. నాంది సినిమాకి సహకారం అందించిన తన మిత్రుడు కి 90 వేల విలువ చేసే స్కూటీ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అంతే కాకుండా... ఇటీవల కోవిడ్ తో మరణించిన దర్శకుల సంఘం సభ్యులలో నలుగురికి తన వంతు సాయంగా లక్ష రూపాయలు ఇచ్చారు.