Advertisementt

పవన్ కోసం కోట్లు ఖర్చు భారీ సెట్లు

Wed 19th May 2021 10:36 PM
hari hara veera mallu movie,hari hara veera mallu sets,hari hara veera mallu movie pawan,pawan kalyan  పవన్ కోసం కోట్లు ఖర్చు భారీ సెట్లు
Huge sets worth crores for Pawan పవన్ కోసం కోట్లు ఖర్చు భారీ సెట్లు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసి విడుదల చెయ్యడానికి ఏకంగా ఏడాదిన్నర పట్టింది. మధ్యలో కరోనా అవి ఇవి అడ్డంకులు వచ్చినా పవన్ కళ్యాణ్ రాజకీయాలు - సినిమా షూటింగ్స్ అంటే సినిమాలు పూర్తవడానికి లేట్ అవడం ఖాయం. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, శేఖర్ కే చంద్ర డైరెక్షన్ లో ఏకే రీమేక్, హరీష్ శంకర్, సురేందర్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఏకే రీమేక్ షూటింగ్స్ తో సెట్స్ మీడుతున్నాయి. హరి హర వీరమల్లు కోసం క్రిష్ గోల్కొండ సెట్, చార్మినార్ సెట్.. ఇలా చాలా రకాల సెట్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు.

మరోపక్క ఏకే రీమేక్ కోసం పోలీస్ స్టేషన్ సెట్, లాడ్జి సెట్ ని దింపారు. తాజాగా హరీష్ శంకర్ మూవీ కోసం కాలేజ్ సెట్ ను వేయిస్తారట. హరీష్ - పవన్ మూవీ లో కీలక సన్నివేశాలు కాలేజ్ లోనే ఉంటాయని, మేజర్ షెడ్యూల్ షూటింగు ఈ సెట్ లోనే జరుగుతుందని అంటున్నారు. అలాగే మిగతా ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన సెట్స్ కూడా వేయిస్తారట. పవన్ కళ్యాణ్ సినిమాలనే కాదు.. చాలా హీరోల కోసం సెట్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. భవిష్యత్తులో షూటింగుకి ఎలాంటి అంతరాయం లేకుండా ఇలా నిర్మాతలు కోట్లు వెచ్చించి సెట్స్ నిర్మాణం చేపడుతున్నారు. ప్రెజెంట్ హరీష్ - పవన్ కాంబో మూవీకి వెయ్యబోయే కాలేజ్ సెట్ కోసం కోట్లు కుమ్మరిస్తున్నారట మైత్రి మూవీ మేకర్స్.

Huge sets worth crores for Pawan:

Huge sets worth crores for Hari Hara Veera Mallu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ