Advertisementt

ఎన్టీఆర్ కు డిఫ‌రెంట్ గా యానిమేష‌న్ వీడియో

Thu 20th May 2021 03:17 PM
animated video,ntr,awara zindangi team,awara zindangi movie,birthday wishes to ntr  ఎన్టీఆర్ కు డిఫ‌రెంట్ గా యానిమేష‌న్ వీడియో
Different animated video for NTR ఎన్టీఆర్ కు డిఫ‌రెంట్ గా యానిమేష‌న్ వీడియో
Advertisement
Ads by CJ

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు డిఫ‌రెంట్ గా యానిమేష‌న్ వీడియోతో  బ‌ర్త్ డే విషెస్ తెలిపిన  ఆవారా జింద‌గి చిత్ర టీమ్.

మాస్‌, క్లాస్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తూ వారి హృద‌యాల్లో తిరుగులేని ఇమేజ్‌ను ద‌క్కించుకున్న టాలీవుడ్ బాద్‌షా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ద‌గ్గ‌రి వాళ్లు ముద్దుగా తార‌క్ అని, అభిమానులు యంగ్ టైగ‌ర్ అని అభిమానంగా పిలుచుకునే ఈ స్టార్ హీరో.. వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. పాత్ర ఏదైనా త‌న‌దైన న‌ట‌న‌, డాన్సులు, పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకునే ఈ స్పాంటేనియ‌స్ యాక్ట‌ర్ పుట్టిన‌రోజుని (మే 20) పురస్క‌రించుకుని ఈ రోజు ఆవారా జింద‌గి చిత్ర టీమ్ ఆయ‌న‌పై ఓ వినూత్న‌మైన యానిమేష‌న్ వీడియోతో బ‌ర్త్ డే విషెస్ తెలిపింది. 

గ‌తంలో సాయి రామ్ శంక‌ర్‌, శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నేనొకర‌కం చిత్రాన్ని నిర్మించిన విభ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తాజాగా ఆవారా జింద‌గి చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో బి.మ‌ధుసూద‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీహ‌న్‌, అనుప‌మ్‌, లంబు మ‌రియు షాయాజీ షిండే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  చాలా వర‌కు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో తెర‌కెక్కుతోంది.  త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటోన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గారికి  మా ఆవారా జింద‌గి టీమ్ త‌ర‌పున యానిమేష‌న్ వీడియోతో బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం దీనికి యూట్యూబ్ లో, సోష‌ల్ మీడియాలో మంచి స్పంద‌న వ‌స్తోంది. త్వ‌ర‌లో మా సినిమాకు సంబంధించిన  మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తాం అన్నారు.

Click Here: NTR Animated video

Different animated video for NTR:

Birthday wishes to NTR by Awara Zindangi Team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ