Advertisementt

బిగ్ బాస్ 4 ఫేమ్ దివి క్యాబ్‌స్టోరీస్ టీజ‌ర్

Thu 20th May 2021 08:16 PM
cab stories movie,cab stories teaser released,big boss fame divi  బిగ్ బాస్ 4 ఫేమ్ దివి క్యాబ్‌స్టోరీస్ టీజ‌ర్
Cab Stories teaser released బిగ్ బాస్ 4 ఫేమ్ దివి క్యాబ్‌స్టోరీస్ టీజ‌ర్
Advertisement
Ads by CJ

స్పార్క్ ఓటీటీ వాగ్దానం చేసినట్లుగానే యూనిక్ కంటెంట్‌తో మ‌న ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా  స్పార్క్ ఓటీటీలో ఇమేజ్‌స్పార్క్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న చిత్రం `క్యాబ్ స్టోరీస్`. దివి వధ్య, గిరిధర్, ధన్‌రాజ్‌, ప్రవీణ్, శ్రీహన్ మరియు సిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం యొక్క ప్రీమియర్ మే 28న స్పార్క్ ఓటీటీలో ప్రదర్శించబడుతుంది.

క్యాబ్ స్టోరీస్ యొక్క టీజర్‌ను సునీల్, వెన్నెల కిషోర్ మరియు శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు. సునీల్ యొక్క వాయిస్ఓవర్ తో క్యాబ్‌లోకి వచ్చే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో ఈ టీజ‌ర్ ప్రారంభమవుతుంది. అన్ని పాత్రలు ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటూ వారి ప్రయాణం ఆలస్యంగా ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. అనేక మలుపులు తిరిగిన వారి ప్రయాణం ఎందుకు ఆల‌స్యంగా ప్రారంభమైందో, ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మే 25న ట్రైల‌ర్ రిలీజ‌య్యే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

టీజర్ ప్రామిసింగ్‌గా ఉండ‌డంతో పాటు మంచి హైప్ తీసుకువ‌చ్చింది. OTT ప్లాట్‌ఫామ్ కోసం ఇదొక ప‌ర్‌ఫెక్ట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. నటీనటులందరూ మంచి నటన క‌న‌బ‌రిచారు. సినిమాటోగ్రఫీ మరియు బిజిఎం మంచి అసెట్. ఇమేజ్‌స్పార్క్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

బిగ్ బాస్ 4 ఫేమ్ దివి వథ్య‌కు మంచి పాత్ర లభించినట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా నిర్మించబడిన ఈ క్యాబ్ స్టోరీస్ కేవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించగా ఎస్ కృష్ణ నిర్మించారు.

Cab Stories teaser released :

Big boss fame Divi Cab Stories teaser released 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ