Advertisementt

స్టార్ మా డాన్స్ ప్లస్ విజేత ఎవరో తెలుసా

Sun 23rd May 2021 10:48 AM
dancee plus,telugu finale,winner,runner,details,star maa  స్టార్ మా డాన్స్ ప్లస్ విజేత ఎవరో తెలుసా
Dancee Plus Telugu Finale: Winner And Runner-Up Details Of The Show Is Out? స్టార్ మా డాన్స్ ప్లస్ విజేత ఎవరో తెలుసా
Advertisement
Ads by CJ

ఒకటే గమనం.. ఒకటే గమ్యం... గెలుపే అంతిమ లక్ష్యం...!

స్టార్‌ మా లో హీట్‌ పెంచుతున్న ఫైనలిస్ట్‌లు

మే 23న స్టార్‌ మా డ్యాన్స్‌ + ఫైనల్‌

గత కొద్ది నెలలుగా స్టార్‌మాలో అత్యంత ఆసక్తిగా జరుగుతున్న స్టార్‌ మా డ్యాన్స్‌+ పోటీలు తుది అంకానికి చేరాయి. ఒకరిని మించిన ప్రదర్శన మరొకరు చేస్తూ వీక్షకులను బుల్లితెరలకు కట్టేసిన డ్యాన్స్‌ మాస్టర్లు తుది పోటీలో  అంతకు మించిన ప్రదర్శనలివ్వడం ద్వారా టైటిల్‌ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్‌ మా డ్యాన్స్‌+ ఫైనల్స్‌ మే 23వ తేదీన జరుగబోతున్నాయి. ఈ ఫైనల్స్‌లో పోటీపడుతున్న పోటీదారులంతా కూడా తమ సత్తా చాటుతామని, టైటిల్‌ తమదే అంటూ విశ్వాసంతో చెబుతున్నారు. ఈ  శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డ్యాన్స్‌ + ఫైనల్‌ పోటీతో పాటుగా  ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే గ్రాండ్‌ ఫినాలే వీక్షించడం ద్వారా 20 లక్షల రూపాయల బహుమతి తో పాటుగా  విజేతగా నిలిచేది ఎవరో తెలియనుంది. గత 21 వారాలుగా స్టార్‌ మాలో డ్యాన్స్‌ + కార్యక్రమంలో ఉత్సాహపరిచే నృత్యాలతో వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఫైనల్స్‌కు చేరిన ఐదు టీమ్‌ల ప్రతినిధులు తమ ప్రయాణంతో పాటుగా తాము నేర్చుకున్న అంశాలు, స్ఫూర్తిప్రదాతలను గురించి  ఏం  చెబుతున్నారో వారి మాటల్లోనే...

1. వాసి టోనీ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌)

ఈ షో హోస్ట్‌ ఓంకార్‌ గారికి ముందుగా ధన్యవాదములు  తెలపాలి. భారత్‌ తరపున అంతర్జాతీయ వేదికలలో పాల్గొనాలనే నా లక్ష్యంకు ఓ దిశను అందించారాయన. ఈ డ్యాన్స్‌ షోలో పాల్గొనడం ద్వారా  నూతన నృత్యరీతులు తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. ఎందుకంటే ఈ డ్యాన్స్‌షో  సాధారణతకు భిన్నంగా ఉండేది. ఆ కారణం చేత అంతర్జాతీయ నృత్యరీతులను తెలుగు రియాల్టీ షోలో ప్రదర్శించే అవకాశం కలిగింది. అదే సమయంలో ప్రతిసారీ అత్యున్నత స్ధాయిలో ప్రదర్శన కోసం తపించేలా పోటీదారులు ఉండటంతో నూతన నృత్యరీతులను నేర్చుకునే అవకాశమూ ఈ షో అందించింది. ఈ షోలో తొలి రోజు నుంచి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. కొంతమంది సభ్యులు గాయపడితే, మరికొంత మంది ఆరోగ్య సమస్యలతో తప్పుకున్నారు. అయినా మా మాస్టర్‌ ఆశను వదులుకోలేదు. మాకు ఆత్మవిశ్వాసం కలిగిస్తూ అద్భుతమైన ప్రదర్శనలు చేసేందుకు తోడ్పడ్డారు.

మాకు ఈ షోలో మరుపురాని ప్రదర్శనలెన్నో ఉన్నప్పటికీ ఓంకార్‌ గారు కూడా ప్రశంసించిన హారర్‌ కట్‌ పై ప్రత్యేకాభిమానం. ఈ షోకు ఫైనల్‌ వరకూ వచ్చామంటే తల్లిదండ్రులు, న్యాయమూర్తులు, మాస్టర్స్‌, మేకప్‌మెన్‌ల సహకారం ఎంతగా ఉందో అంతకు మించి మా మాస్టర్‌ యశ్వంత్‌ మాస్టర్‌ తోడ్పాటు అంతకు మించి ఉంది.

డ్యాన్స్‌ ప్లస్‌ నాకెన్నో మధురానుభూతులు అందించింది. ఫైనల్‌ కోసం ప్రత్యేకంగా రాబోతున్నాం.

2. సంకేత్‌ సహదేవ్‌ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌)

డ్యాన్స్‌ ప్లస్‌లో నా ప్రయాణం అందమైనది మాత్రమే కాదు అనితర సాధ్యమైనది.  యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌గా ఎన్నడూ రాజీలేని పోరాటం చేయడం కారణంగానే ఫైనల్‌కు చేరుకోగలిగాం. న్యాయనిర్ణేతలందరూ కూడా  మా పట్ల అపూర్వమైన ప్రేమను చూపారు. ఇప్పటి వరకూ మా ప్రదర్శన మరుపురాని రీతిలో సాగింది. ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త అంశాలను న్యాయనిర్ణేతల నుంచి నేర్చుకున్నాం.ఈ షో చేయడం ద్వారా నా పై నాకు నమ్మకం వచ్చింది.

ఈ డ్యాన్స్‌+ షోలో మరుపురాని సంఘటన ఏమిటంటే ఓ పాట మధ్యలో నేను కుటుంబ కారణాల రీత్యా నృత్యం చేయకుండా ఆగిపోవడం. నా జీవితంలో ఇది తొలిసారి. ఈ డ్యాన్స్‌ షోలో ఎప్పుడైనా నిరాశకు గురైతే ఓంకార్‌ గారు, ప్రదీప్‌ నాకు స్ఫూర్తి కలిగించే వారు. ఈ షో ఇంత హిట్‌ అయిందంటే ఇతర పోటీదారుల పోటీతత్త్వం కూడా కారణమే !

నా వరకూ ఇండియాలో నెంబర్‌ 1 కొరియోగ్రాఫర్‌గా నిలువాలనేది లక్ష్యం. అంతేకాదు నా చివరి శ్వాస వరకూ నృత్యం ద్వారా వీక్షకులను రంజింపజేయాలనుకుంటున్నాను. నా జీవితాన్ని సమూలంగా డ్యాన్స్‌ +షో మార్చింది.

3. మహేశ్వరి – తేజస్విని (బాబా మాస్టర్‌ బృందం)

స్టార్‌ మా డ్యాన్స్‌+లో మా ప్రయాణం అద్భుతం. ఎన్నో రకాల నృత్యరీతులను నేర్చుకునే అవకాశం ఈ షో మాకు అందించింది.  అసలు ఇన్ని రకాల నృత్యాలను చేస్తామని ఎన్నడూ మేమనుకోలేదు.  అసాధారణ ప్రతిభావంతులైన పోటీదారులను కలుసుకోవడమే కాదు వారి నుంచి కూడా నేర్చుకునే అవకాశమూ మాకు ఈ షో అందించింది. అదే సమయంలో మన భారతీయ సంప్రదాయ భరతనాట్య శక్తిని ప్రదర్శించే అవకాశమూ ఈ షో కల్పించింది.

ఈ షో మాకు మరో ఇల్లు లాంటిది. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోవడమే కాదు నేర్చుకునేందుకు ఎన్నో అవకాశాలను మాకందించారు.

గత 13 సంవత్సరాలుగా మేము భరతనాట్యం నేర్చుకుంటున్నాము. ఈ షోకు ఆడిషన్స్‌ కోసం వచ్చినప్పుడు సంప్రదాయ నృత్యరీతులను గురించి మన వీక్షకులకు చూపడమే కాదు సంప్రదాయ నృత్యరీతుల పట్ల వారికి ఆసక్తి కలిగించాలని కోరుకున్నాం. అదే సమయంలో మరెన్నో విభిన్న నృత్యరీతులనూ మేము నేర్చుకోవాలనుకున్నాం. ఆ లక్ష్యం నెరవేరేందుకు ఈ షో మాకు అవకాశం కల్పించింది.

ఈ షోతో మేము నేర్చుకున్న అంశమంటే ఎట్టి పరిస్థితులలోనూ  ఖచ్చితత్త్వం పరంగా రాజీపడకూడదని ! మనం చేసేది చిన్న తప్పే కావొచ్చు కానీ  అది తప్పే అని తెలుసుకున్నాం.  హార్డ్‌వర్క్‌ ఎంత ముఖ్యమో స్మార్ట్‌ వర్క్‌ కూడా అంతే ముఖ్యం. నైపుణ్యం, టెక్నిక్‌ పరంగా మెరుగుపరుచుకునేందుకు డ్యాన్స్‌ ప్లస్‌ ఎంతగానో తోడ్పడింది.

ఇక ఈ షోలో మరుపురాని అంశాలెన్నో ఉన్నాయి. కానీ లెంజండరీ కొరియోగ్రాఫర్‌ సుందరంమాస్టార్‌ ముందు ప్రదర్శన ఇవ్వడం మరిచిపోలేం. ఆయన నిలబడి మమ్మల్ని అభినందించడం  మా జీవితకాలంలో దక్కిన అపూర్వ ప్రశంసగా భావిస్తున్నాం.

ఈ ప్రయాణంలో మాకు ఎంతగానో తోడ్పాటునందించడంతో పాటుగా అనుక్షణం మాకు స్ఫూర్తి కలిగించినది మా గురు శ్రీమతి మంజుల రామస్వామి. ఆమె మాకు స్ఫూర్తి ప్రదాత. శాస్త్రీయ నృత్యకారులుగా ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలుపుతున్నాం. పాశ్చాత్య నృత్యరీతులను అభిమానించే వారికి కూడా సంప్రదాయ నృత్యరీతులలోని గొప్పతనం తెలుపాలనుకున్నాం. ఆ ప్రయత్నంలో కొంతమేర సఫలీకృతులయ్యామని భావిస్తున్నాం.

ఈ ఆరు నెలల డ్యాన్స్‌ ప్లస్‌ ప్రయాణం అద్భుతంగా సాగింది. ఓ విద్యా సంస్థలా మాకు ఈ షో తోడ్పడింది. కెమెరా ముందు మాత్రమే కాదు  వెనుక కూడా చాలా నేర్చుకున్నాం. మా జీవితకాలంలో ఎన్నటికీ మరువలేనటువంటి మధురానుభూతులెన్నో ఈ షో ద్వారా సొంతం చేసుకోగలిగాం.

4. జియా ఠాకూర్‌ (అనీ మాస్టర్‌ బృందం)

నా జీవిత కాలంలో పొందిన అత్యుత్తమ అనుభవం డ్యాన్స్‌ + షోలో పాల్గొనడం. ఎన్నో అంశాలు, నృత్య రీతులు, నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం ఈ వేదిక అందించింది.

మొదట్లో లిరికల్‌, హిప్‌హాప్‌ మాత్రమే తెలిసిన నాకు జానపదంతో పాటుగా సమకాలీన, వైల్డ్‌ లిరికల్‌, రోబోటిక్స్‌, చార్లీ చాప్లిన్‌ శైలి, మైఖేల్‌ జాక్సన్‌ శైలి... ఇలా ఎన్నో నేర్చుకునే అవకాశం లభించింది.  ఇక్కడ లభించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. నాకు మరుపురాని అనుభవమంటే చార్లీచాప్లిన్‌ రౌండ్‌లో న్యాయ మూర్తులు నుంచి లభించిన ప్రశంసలు.

ఈ షోలో  నిరుత్సాహ పడిన సంఘటన అంటూ ఏమీలేదు. విమర్శను కూడా కాంప్లిమెంట్‌గానే తీసుకుని నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించా. ఫైనల్స్‌కు చేరుకున్నాను. డ్యాన్స్‌ ప్లస్‌ స్టేజ్‌ ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదే.  నా జీవితంలో ఈ షోకు ప్రత్యేక స్థానం ఉంది. 

నా మెంటార్‌ అనీ మేడమ్‌ నుంచి అందుకున్న తోడ్పాటు మరువలేనిది.  ఆమె ప్రోత్సాహం కారణంగానే విభిన్న నృత్య రీతులను అతి సులభంగా చేయగలిగాను.

5. డార్జిలింగ్‌ డెవిల్స్‌ (రఘు మాస్టర్‌ బృందం)

స్టార్‌ మా డ్యాన్స్‌+లో మా ప్రయాణం అద్భుతంగా సాగింది. మా జీవితాలలో ఇది ప్రత్యేకమైన షో. ఈ షో ద్వారా మేమెంతగానో నేర్చుకున్నాం. డ్యాన్స్‌లో లెజండరీ డ్యాన్సర్స్‌ ముందు ప్రదర్శన చేయడం, అదీ భారీ సంఖ్యలో కెమెరాల ముందు నృత్యంచేయడం ఓ వైవిధ్యమైన అనుభవంగా మిగిలిపోతుంది. ఈ ప్లాట్‌ఫామ్‌తో మా ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఓ విధంగా మేము కూడా సెలబ్రిటీలుగా మారిపోయాం. నిజానికి డ్యాన్‌+ షో మా ప్రదర్శన స్థాయిని సమూలంగా మార్చేసింది. ఈ కార్యక్రమం తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన చేయగలమని భావిస్తున్నాం.

ఈ షోలో మాకు  మరిచిపోలేని సంఘటన ఏమైనా ఉందంటే బాబా భాస్కర్‌ కొరియోగ్రఫీని రీ క్రియేట్‌ చేయడం. దానికి బాబా భాస్కర్‌ గారు కూడా ప్రశంసించడం మరువలేం.

ఈ షోకు వచ్చిన తరువాత చాలా నేర్చుకున్నాం. గతంలో  ఎన్నడూ భారీ సెట్‌ లేదంటే భారీ గ్రూప్‌లుగా నృత్యం చేయడం ఎరుగం. ఈ స్టేజ్‌ మాకు ఎన్నో నేర్పింది.

ఈ షో తరువాత ఏమిటీ అని అంటే , జాతీయ షోలలో పాల్గొనాలనేది ఆలోచన. మాకెవరికీ పెద్దగా బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ప్రొఫెషనల్‌గా ఎదిగేందుకు డ్యాన్స్‌+ షో మాకు ఎంతగానో తోడ్పడింది.

మేము  ఈ స్థాయికి వచ్చామంటే రఘు మాస్టర్‌ కృషి ఎంతో ఉంది. తొలి నుంచి ఆయన మాతో ఉన్నారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్స్‌లో కూడా ఆయన మాకోసం సమయం కేటాయించడం ఎన్నటికీ మరిచిపోము.

Dancee Plus Telugu Finale: Winner And Runner-Up Details Of The Show Is Out?:

Dancee Plus Telugu Finale: Winner And Runner-Up Details Of The Show Is Out?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ