Advertisementt

బ్యాచ్ తో వస్తున్న బాల నటుడు

Sun 23rd May 2021 09:15 PM
batch movie,sathvik varma,child artist sathvik varma  బ్యాచ్ తో వస్తున్న బాల నటుడు
Another child actor as hero బ్యాచ్ తో వస్తున్న బాల నటుడు
Advertisement
Ads by CJ

బాహుబలి, రేసుగుర్రం, మల్లి రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన  సాత్విక్ వర్మ ఇప్పుడు మన ముందుకు హీరో గా మనల్ని  మరింత ఎంటర్టైన్ చేయటానికి బ్యాచ్ చిత్రం తో మన ముందుకు వస్తున్నాడు. ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో సాత్విక్ వర్మ మరియు నేహా పఠాన్ హీరో హీరోయిన్ గా  శివ దర్శకత్వం లో రఘు కుంచే సంగీత సారధ్యంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం బ్యాచ్.  ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీ గా ఉంది. 

షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ బ్యాచ్ ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం. యూత్ కి కావాల్సిన అన్ని అంశాలతో చిత్రాన్ని నిర్మించాము. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యం లో  కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కొందరు పోకిరి కుర్రాళ్ల కథే మా సినిమా.  షూటింగ్ పూర్తి అయ్యింది, ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేస్తాం అని తెలిపారు. నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ దర్శకుడు శివ చెప్పిన కథ బాగా నచ్చింది.  మా చిత్రం తో బాల నటుడు సాత్విక్ వర్మ ని హీరో గా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం జనవరి లో షూటింగ్ మొదలు పెట్టి హైదరాబాద్, విశాఖపట్నం మరియు కాకినాడ వంటి పరిసర ప్రాంతాల్లో 59 రోజుల్లో పూర్తి చేశాం. మా సినిమా కి సంగీత దర్శకుడు రఘు కుంచే మరో హీరో. సాత్విక్ వర్మ, రఘు కుంచే కాంబినేషన్ లో వచ్చే పాటలు అద్భుతంగా వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేస్తాం అని తెలిపారు. 

చిత్రం: బ్యాచ్, సమర్పణ: బేబీ ఆరాధ్య, బ్యానర్: ఆకాంక్ష మూవీ మేకర్స్, నటి నటులు: సాత్విక్ వర్మ, నేహా పఠాన్, బాహుబలి ప్రభాకర్, సంధ్యా జనక్, మిర్చి మాధవి, వినోద్ కుమార్, చిన్న, తదితరులు. కెమెరా: వెంకట్ మన్నం, సంగీతం: రఘు కుంచే, కొరియోగ్రఫీ: రాజ్ పైడి, ఎడిటింగ్: జె పి, పి అర్ ఓ: పాల్ పవన్, డైరెక్టర్: శివ, కో ప్రొడ్యూసర్: సత్తి బాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది, నిర్మాత: రమేష్ ఘనమజ్జి.

Another child actor as hero:

Another child actor as hero in Batch movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ