Advertisementt

కపటనాటక సూత్రధారి ట్రైలర్

Sun 23rd May 2021 09:29 PM
kapata nataka sutradhari movie,kapata nataka sutradhari trailer,kapata nataka sutradhari  కపటనాటక సూత్రధారి ట్రైలర్
Kapata Nataka Sutradhari trailer కపటనాటక సూత్రధారి ట్రైలర్
Advertisement
Ads by CJ

ప్రముఖ సీనియర్ నిర్మాత సి అశ్వినీదత్ విడుదల చేసిన కపటనాటక సూత్రధారి ట్రైలర్.

వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం కపటనాటక సూత్రధారి.. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్ లు సహా నిర్మాతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి, ఫస్ట్ కాపీ సిద్దంగా ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ప్రముఖ సీనియర్ నిర్మాత సి అశ్వినీదత్ రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ.. ఈరోజుల్లో సినిమా పరిశ్రమకు చాలామంది కొత్త దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు.. వారు కంప్యూటర్ టెక్నాలజీ విషయంలో అన్ని నేర్చుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. అలాగే. కపట నాటక సూత్రదారి ట్రెయిలర్ చాలా కొత్తగా ఉంది. ఈ చిత్రాన్ని క్రాంతి అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా మనీష్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తప్పకుండా వీరు చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అందరికి అల్ ది బెస్ట్ అన్నారు. 

నిర్మాత మనీష్ మాట్లాడుతూ.. మా కపట నాటక సూత్రదారి సినిమా ట్రైలర్ నీ ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతగా ఆయనే మాకు స్ఫూర్తి, మా దర్శకుడు క్రాంతి సినిమాను చాలా కొత్తగా ఆవిష్కరించాడు. ఇక సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి ఫస్ట్ కాపీ సిద్దంగా ఉంది. సో త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

నటీనటులు: విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్.

సాంకేతిక నిపుణులు: డాన్స్: జిత్తు మాస్టర్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, సంగీతం: రామ్ తవ్వా, నేపథ్య సంగీతం: వికాస్ బడిస, సినిమాటోగ్రఫీ: సుభాష్ దొంతి, మాటలు: రామకృష్ణ, దర్శకుడు: క్రాంతి సైన, సహా నిర్మాతలు: ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్, నిర్మాత : మనీష్ (హలీమ్).

Kapata Nataka Sutradhari trailer:

kapata nataka paatradhari trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ