Advertisementt

ఆసక్తి రేకెత్తిస్తున్న అల్లు శిరీష్

Sat 29th May 2021 01:55 PM
allu sirish,anu emmanuel,allu sirish6,sirish6,sirish 6 pre look  ఆసక్తి రేకెత్తిస్తున్న అల్లు శిరీష్
AlluSirish6 impressive second pre-look ఆసక్తి రేకెత్తిస్తున్న అల్లు శిరీష్
Advertisement
Ads by CJ

కొత్త జంట‌, శీర‌స్తు శుభ‌స్తు, ఏబిసిడి వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో ఒక్క క్ష‌ణం వంటి వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్, ఇప్పుడు త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 6 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శిరీష్ కి జంట‌గా మ‌ల్లూ బ్యూటీ అనుఇమానుయెల్ న‌టిస్తోంది. మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో 100% ల‌వ్, భలే భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా సిద్ధ‌మైంది. మే30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు అల్లు శిరీష్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 6 ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్నాను. 

ఈ వివ‌రాల‌ను తెలుపుతూ ఇటీవ‌లే చేసిన ప్రీ లుక్ పాన్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయింది. ఇదే ఉత్సాహాంతో తాజాగా మ‌రో ప్రీలుక్ ని విడుద‌ల చేసి సరికొత్త ట్రెండ్ కి అల్లు శిరీష్ నాంధి ప‌లికారు .  అల్లు శిరీష్, అనుఇమానుయెల్ మధ్య న‌డిచే రొమాన్స్ నేప‌థ్యంలో ఓ ఇంటెన్స్ స్టిల్ తో  సిద్ధం చేసి విడుద‌ల చేసిన ఈ ప్రీలుక్ 2 ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఈ ప్రీలుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేప‌థ్యంలో మే 30న విడుద‌ల కాబోతున్న‌ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రు, మ్యూజిక్, సాంకేతిక నిపుణ‌ల‌తో పాటు కీల‌క వివ‌రాల్ని మే 30న అధికారికంగా విడుద‌ల చేయ‌నున్నారు.

AlluSirish6 impressive second pre-look:

A day before the release of first look of Allu Sirish next

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ