Advertisementt

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ కొత్త చిత్రం

Sat 29th May 2021 04:30 PM
sanjay rao,brahmaji son,sanjay rao birthday special  బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ కొత్త చిత్రం
Sanjay Rao New Movie బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ కొత్త చిత్రం
Advertisement
Ads by CJ

ఓ పిట్టకథ సినిమాలతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా  వి.ఎస్. ఫణీంద్రన్ దర్శకత్వంలో   నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై  ప్రొడ్యూసర్ కమ్మరి.రవికుమార్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెo.1 చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది. సంజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా రోహిణి ముంజల్, సాధన నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో  రాజా రవీంద్ర, ప్రబాస్ శ్రీను, హేమ, ప్రగతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమా గురించి  నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ ... ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది ప్రేమా? పెళ్ళా? అనే కధాంశంతో, లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాము, కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తరువాత షూటింగ్ మొదలుపెడతాం అన్నారు.    

దర్శకుడు వి ఎస్ ఫణింద్రన్ మాట్లాడుతూ .. సరికొత్త కథా కథనంతో తెరకెక్కించే సినిమా ఇది. ఈ కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఆసక్తికర ప్రశ్న ? అదే అంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా విషయంలో నిర్మాత చాలా సపోర్ట్ అందిస్తున్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తితో ఈ చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తాం అని అన్నారు.  

Sanjay Rao New Movie :

Sanjay Rao Birthday Special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ