Advertisementt

సెహరి టైటిల్‌ సాంగ్‌ రిలీజ్

Mon 07th Jun 2021 05:01 PM
harsh kanumilli,gangasagar dwaraka,virgo pictures,sehari title song out  సెహరి టైటిల్‌ సాంగ్‌ రిలీజ్
Sehari Title Song Out సెహరి టైటిల్‌ సాంగ్‌ రిలీజ్
Advertisement
Ads by CJ

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం సెహరి. జ్ఞానసాగర్ ద్వారక  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా సినిమాపై కూడా అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో బాలకృష్ణగారి స్పీచ్‌ హైలైట్‌గా నిల‌వ‌డంతో పాటు సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ మొదలైపోయాయి. ప్రశాంత్‌ ఆర్‌ విహరి సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను లాంచ్‌ చేశారు మేక‌ర్స్‌. కచడ కచడ హో గయా.... అర్థమైత లేదయా, అచట ముచట లేదయా... అంటూ మొదలైయ్యే ఈ పాట  ఇక లైట్‌ లేలోరే! మాస్‌ స్టెప్పు వేయ్‌ రే..నేను ఆడాలన్నా..పాడాలన్నా జిందగీలో లేదే సెహరి...చిల్‌ అవ్వాలన్నా లవ్వాలన్నా జిందగీలో లేదే సెహరి..సెహ‌రి అంటూ సాగుతుంది. సోమవారం విడుదలైన ఈ క్యాచీ సాంగ్‌ శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ సెహరి టైటిల్‌ సాంగ్‌లో హర్ష్‌ డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ అదిరిపోయాయి. ఈ పాటకు యశ్‌ మాస్టర్‌ కొరియో గ్రఫీ చేశారు. హిట్‌ ఫిల్మ్‌ జాతిరత్నాలు సినిమాలోని చిట్టి నీ నవ్వంటే.. అనే సాంగ్‌ పాడిన చౌరస్తా బ్యాండ్‌ ఫేమ్‌ రామ్‌ మిరియాల జిందగీలో లేదే సెహరి..సెహరి పాటను పాడారు. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల ఈ పాటకు లిరిక్స్‌ అందించారు.

Sehari Title Song Out:

Harsh Kanumilli, Gangasagar Dwaraka, Virgo Pictures Sehari Title Song Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ