Advertisementt

జూనియర్ ఆర్టిస్టులకు నిత్యావసరాలు పంపిణీ

Thu 10th Jun 2021 02:49 PM
manam sytham,essentials,junior artists,thotakura raghu,kadambari kiran,chadalavada srinivasrao  జూనియర్ ఆర్టిస్టులకు నిత్యావసరాలు పంపిణీ
Distribution of essentials to junior artists జూనియర్ ఆర్టిస్టులకు నిత్యావసరాలు పంపిణీ
Advertisement
Ads by CJ

జూనియర్ ఆర్టిస్టులకు మనం సైతం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని మనం సైతం సేవా సంస్థ ఇవాళ జూనియర్ ఆర్టిస్ట్ లకు నిత్యావసరాలను అందించింది. హైదరాబాద్ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం వద్ద బియ్యం ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని అనిల్, వినోద్ బాల, శ్రీను గౌడ్, స్వామి గౌడ్ , రవి, అనిత నిమ్మగడ్డ, సీసీ శ్రీను, రమేష్ రాజా తదితరులు పాల్గొన్నారు..

ఈ నిత్యావసరాల పంపిణీకి చదలవాడ శ్రీనివాసరావు, యూకే రామ్ నామగిరి, పీఎస్ఎన్ రాజు, డైరెక్టర్ గుడ్లూరి అశోక్ బాబు, బి కనకదుర్గమ్మ, సత్య శ్రీకృతి, డైరెక్టర్ దశరథ్, సంపత్ స్టూడియో, జొన్నాదుల సుధాకర్, ప్రభంజన్, తోటకూర రఘు, ఎంఎస్ఎం ఉమాకాంత్, దర్శకుడు జి నాగేశరరెడ్డి, వాకాటి నరసింహస్వామి తదితరులు తమ సహకారం అందించారు.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. షూటింగ్స్ లేక మా జూనియర్ ఆర్టిస్ట్ సోదరులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ వారికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులు అందించాం. కష్టకాలంలో అందిన ఈ సాయానికి వారి కళ్లు కృతజ్ఞతతో నిండిపోయాయి. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకు, సహకారం అందించిన పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా.. అన్నారు.

Distribution of essentials to junior artists:

Distribution of essentials to junior artists

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ