Advertisementt

శ్రీలీల బర్త్ డే స్పెషల్: పెళ్లి సంద‌D లుక్

Mon 14th Jun 2021 12:39 PM
heroine sreeleela,sree leela birthday special,pelli sandadi poster  శ్రీలీల బర్త్ డే స్పెషల్: పెళ్లి సంద‌D లుక్
Sreeleela birthday special poster శ్రీలీల బర్త్ డే స్పెషల్: పెళ్లి సంద‌D లుక్
Advertisement
Ads by CJ

కమర్షియల్.. భక్తి రస చిత్రాలతో క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీస్ సహా అన్నివర్గాల ప్రేక్షకులను అల‌రించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్ర‌త్యేక‌మైన ప్ర‌స్తావ‌న అక్క‌ర్లేదు. అగ్ర క‌థానాయ‌కులంద‌రితో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించారు. క‌థానాయ‌కుల‌నే కాదు.. ఎంద‌రో హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన గోల్డెన్ హ్యాండ్ ఆయ‌న‌ది. హీరోయిన్స్‌ను ఎంతో అందంగా మ‌రే ద‌ర్శ‌కుడు చూపించ‌నంత గ్లామ‌ర‌స్‌గా చూపించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. అలాంటి శ‌తాధిక ద‌ర్శ‌కుడు త‌న గోల్డెన్ హ్యాండ్‌తో మ‌రో అందాల భామ‌ను పెళ్లి సంద‌D చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఆ అందం పేరే.. శ్రీలీల‌.

ఈ బ్యూటీ డాల్ పుట్టిన‌రోజు సోమ‌వారం(జూన్ 14). ఈ సంద‌ర్భంగా పెళ్లి సంద‌D యూనిట్ సినిమా నుంచి శ్రీలీల గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది. రాఘ‌వేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. ఆయ‌న శిష్యురాలు, చిత్ర‌ ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి శ్రీలీల అంతే గ్లామ‌ర‌స్‌గా తెర‌కెక్కించిన‌ట్లు గ్లింప్స్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. శ్రీలీల బెంగుళూరులో స్థిర‌ప‌డ్డ తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. మెడిసిన్ చ‌దువుతుంది. అయితే న‌ట‌న‌పై ఆస‌క్తితో సినీ రంగంలో అవ‌కాశాల కోసం చూస్తున్న త‌రుణంలో రాఘ‌వేంద్రరావు సూచ‌న మేర‌కు గౌరి రోణంకి శ్రీలీల హీరోయిన్‌గా ఎంపిక చేశారు. హాకీ, స్విమ్మింగ్ వంటి స్పోర్ట్స్‌తో పాటు క్లాసిక‌ల్ డాన్స్‌.. బాలే డాన్స్‌లోనూ శ్రీలీలకు మంచి ప్రావీణ్యం ఉంది. ఎంద‌రో హీరోయిన్స్‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డం, తెలుగు వారి హృద‌యాల్లో వారికి సుస్థిర‌మైన స్థానాన్ని క‌లిగించిన ద‌ర్శ‌కేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న పెళ్లి సంద‌D చిత్రంలో న‌టించ‌డం హీరోయిన్‌గా త‌న‌కెంతో ప్ల‌స్ అని హీరోయిన్ శ్రీలీల తెలియ‌జేసింది. 

Sreeleela birthday special poster:

Sreeleela birthday special poster n Pelli Sandadi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ