బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ ఫుట్ ఈమధ్యన సోషల్ మీడియాలో అందచందాలతో, నాజూకు తనంతో ఫోటో షూట్స్ అంటూ చెలరేగిపోతుంది. ఫుల్ డైట్ మెయింటింగ్ చేస్తూ నాజూగ్గా అందంగా తయారైన పాయల్ కి టాలీవుడ్ యంగ్ ఆఫర్ నుండి దక్కింది
లవ్‌లీ రాక్‌స్టార్ ఆది సాయికుమార్ హీరోగా దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి కిరాతక అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పూత్ అవకాశం పట్టేసింది. ఈ సందర్భంగా..
చిత్ర దర్శకుడు ఎం. వీరభద్రం మాట్లాడుతూ.. ఆది కుమార్ హీరోగా నేను దర్శకత్వం వహించిన చుట్టాలబ్బాయి సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. మరోసారి మా ఇద్దరి కాంబినేషన్‌లో అద్భుతమైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆది సరసన పాయల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా నటిస్తుంది. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి గారు అన్‌కాంప్రమైజ్‌డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అని చెప్పారు.