Advertisementt

ర‌వితేజ‌ షూటింగ్‌ వివరాలు

Sun 27th Jun 2021 02:48 PM
ravi teja,ravi teja shooting details,mass maharaja ravi teja,direction sarath mandava,divyansha koushik,nassar,sr naresh,pavitra lokesh,rahul ramakrishna  ర‌వితేజ‌ షూటింగ్‌ వివరాలు
Ravi Teja shooting details ర‌వితేజ‌ షూటింగ్‌ వివరాలు
Advertisement
Ads by CJ

జులై 1 నుండి హైద‌రాబాద్‌లో ప్రారంభంకానున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శ‌ర‌త్ మండ‌వ‌, ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి ప్రొడ‌క్ష‌న్ నెం.4 రెగ్యుల‌ర్ షూటింగ్‌.

క్రాక్ సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ హిట్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో  ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే..రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌వితేజను ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో చూపించ‌బోతున్నారు  ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌. ర‌వితేజ స‌ర‌స‌న దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జులై 1 నుండి హైద‌రాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్ట‌రీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో టీమ్ అంద‌రూ పాల్గొన‌నున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు శ‌ర‌త్‌ మండ‌వ మ‌న తెలుగు వారే.. గతంలో వెంకటేష్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌కు రచయితగా పనిచేశారు.

Ravi Teja shooting details:

Ravi Teja shooting details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ