Advertisementt

సెన్సార్‌కు గ‌ల్లీరౌడీ

Mon 28th Jun 2021 03:31 PM
gully rowdy movie,sundeep kishan,rajendra prasad,bobby simha,neha shetty,posani krishna murali,vennela kishore,gully rowdy,censor.  సెన్సార్‌కు గ‌ల్లీరౌడీ
Gully Rowdy gears up for Censor సెన్సార్‌కు గ‌ల్లీరౌడీ
Advertisement
Ads by CJ

వెర్సటైల్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ స్టార్ సందీప్ కిష‌న్ టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం గ‌ల్లీరౌడీ. టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా.. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట‌న్ గల్లీ రౌడీ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ గల్లీ రౌడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి హీరోయిన్‌. ఈ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధ‌మైంది. 

ఈ సంద‌ర్భంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు సందీప్ కిష‌న్ చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ పాత్ర‌ను గ‌ల్లీరౌడీలో చేశారు. సినిమా అద్భుతంగా వ‌చ్చింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ సినిమా ఎంత హిలేరియ‌స్‌గా ఉంటుంద‌నే విష‌యాన్ని రివీల్ చేసి అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. హీరో, హీరోయిన్ మ‌ధ్య సాగే ల‌వ్ మాంటేజ్ సాంగ్ పుట్టనే ప్రేమ.. కు మంచి స్పందన వచ్చింది. సినిమా ఫన్ రైడర్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం ఖాయ‌మ‌ని అంద‌రిలో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అలాగే న‌వ్వుల కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్‌గారు సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆయ‌న పాత్రకున్న ప్రాధాన్య‌త ఏంటో సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. అలాగే బాబీసింహాగారు కూడా కీల‌క పాత్ర‌ను పోషించారు. ది ఫ్యామిలీ మేన్ 2, ఛ‌లో వంటి చిత్రాల్లో న‌టించిన మెప్పించిన మైమ్ గోపి ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టించారు. అలాగే హీరోయిన్ నేహాశెట్టి రోల్‌.. ఇలా అంద‌రి పాత్ర‌లను ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సెన్సార్ కూడా పూర్తి చేసుకోనుంది. సెన్సార్ పూర్తి కాగానే సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తాం అని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.

న‌టీన‌టులు:  సందీప్ కిష‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు

బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా, స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌, ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి, నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, సంగీతం: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌, స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌, క‌థ‌: భాను, ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, స్టైలిష్ట్‌: నీర‌జ కోన‌, పి.ఆర్‌.ఒ: వంశీ కాక‌. 

Gully Rowdy gears up for Censor:

Gully Rowdy gears up for Censor formalities

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ