Advertisementt

డాక్టర్ సాబ్ టైటిల్ లోగో

Fri 02nd Jul 2021 01:47 PM
doctor saab,doctor saab movie,doctor saab title logo,hero soban,sobhan  డాక్టర్ సాబ్ టైటిల్ లోగో
Doctor Saab title logo డాక్టర్ సాబ్ టైటిల్ లోగో
Advertisement
Ads by CJ

డాక్టర్ సాబ్ సినిమా టైటిల్ లోగో విడుదల చేసిన నిర్మాత సురేష్ కొండేటి..!!

ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై శోభన్ హీరోగా డి.ఎస్.బి దర్శకత్వంలో ఎస్.పి నిర్మాణ సారథ్యలో తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్ సాబ్. డాక్టర్స్ ఎదురుకునే పరిస్థితుల నేపథ్యంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి శివ సంగీతం అందిస్తుండగా ఎన్. ప్రభాకర్ రావు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 1400 సినిమాలకు పైగా ఫైట్ మాస్టర్ గా చేసిన విక్కీ మాస్టర్ ఈ సినిమా ని సమర్పిస్తుండడం విశేషం.  కాగా ఈ సినిమా కి సంబందించిన టైటిల్ లోగో ని ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవని మరువలేం. వారు నిజమైన దేవుళ్ళు. అలాంటి డాక్టర్స్ లో ఒకరు శోభన్. అయన హీరోగా నిర్మాతగా చేస్తున్న సినిమా డాక్టర్ సాబ్, ఈ  చిత్ర లోగో ని నేను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నాకు చిరకాల మిత్రుడు విక్కీ మాస్టర్ ఈ సినిమా ను సమర్పిస్తుండం సినిమా పై అంచనాలను పెంచుతుంది.. చిత్ర టీం కి అల్ ది బెస్ట్.. అన్నారు. 

విక్కీ మాస్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ సాబ్ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసిన నా మిత్రుడు సురేష్ గారికి ధన్యవాదాలు.   నా శిష్యులైనా శోభన్, సురేష్ లు ఈ చిత్రానికి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ చేశారు. డాక్టర్ అనేవాడు దేవుడు అని చెప్పే సినిమానే ఇది. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరు తెస్తుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుంది అన్నారు. 

దర్శకుడు డి ఎస్ బి మాట్లాడుతూ.. ఎంతో  కష్టపడి తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. నన్ను నమ్మి ఈ సినిమా ని తెరకెక్కించిన ఈ చిత్ర నిర్మాత, హీరో శోభన్ గారికి కృతజ్ఞతలు. మా కోరిక మన్నించి ఈ సినిమా టైటిల్ ని ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి గారికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది.. అన్నారు. 

హీరో శోభన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే హీరోగా చేయాలనిపించింది. ఈ సినిమా చేయడానికి కారణం విక్కీ మాస్టర్. అయన సినిమాకు మొదటినుంచి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. దర్శకుడు సురేష్ సహకారం బాగా ఉంది. సినిమా బాగా చేశాడు. మా టైటిల్ లోగో ఆవిష్కరించిన సురేష్ కొండేటి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్నారు.

సాంకేతిక నిపుణులు : బ్యానర్ : ఎస్పీ క్రియేషన్స్, సమర్పణ : విక్కీ మాస్టర్, సంగీతం : శివ, సహా నిర్మాత : ఎన్. ప్రభాకర్ రావు, దర్శకుడు :  డి.ఎస్.బి. నిర్మాత : ఎస్పీ.

Doctor Saab title logo:

Doctor Saab title logo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ