Advertisementt

నవ్వుల పట్టాలపైకి ఎఫ్ 3

Fri 02nd Jul 2021 05:34 PM
venkatesh - varun tej combo,venkatesh,varun tej,f3 shoots resume,f3 movie,f3 shooting started  నవ్వుల పట్టాలపైకి ఎఫ్ 3
F3 shoots resume నవ్వుల పట్టాలపైకి ఎఫ్ 3
Advertisement
Ads by CJ

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో 2019 సంక్రాంతి విన్న‌ర్‌గా  బాక్సాఫీస్ వ‌ద్ద‌ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ఎఫ్ 2. ..వరుస విజయాలతో దూసుకెళ్తోన్న బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన ఎఫ్‌2 చిత్రానికి ఫ్రాంచైజీగా ఎఫ్ 3 రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ ఎంటర్‌టైనర్‌కు ఫ్రాంచైజీగా వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో రీస్టార్ట్‌ అయ్యింది. ఈ సందర్భంగా 

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ 2019లో సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఎఫ్‌ 2 సినిమాకు ఫ్రాంచైజీగా ఎఫ్‌ 3 సినిమాను అదే టీమ్‌తో స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను కాస్త పరిస్థితులు కుదుటపడుటుండటంతో రీస్టార్ట్‌ చేశాం. హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ప్రారంభమైంది.  సెట్స్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో షూటింగ్‌ చేస్తున్నాం. వెంకటేశ్‌గారు, వరుణ్‌తేజ్‌, సునీల్‌ సహా మెయిన్‌ కాస్ట్‌ అండ్‌ క్రూపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి..ఎఫ్3 చిత్రాన్నితనదైన స్టైల్లో ఎఫ్‌2కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిస్తున్నారు. మా బ్యాన‌ర్‌లో మ‌రో న‌వ్వుల రైడ్ క‌న్‌ఫ‌ర్మ్‌ అన్నారు. 

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ - ఎఫ్ 2కు ఫ్రాంచైజీగా మోర్ ఫ‌న్‌తో ఎఫ్‌3 చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మా సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌ అయ్యింది. విక్ట‌రీ వెంక‌టేశ్‌గారు, మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌గారు.. నిర్మాత‌లు రాజుగారు, శిరీష‌న్న స‌పోర్ట్‌తో వీలైనంత త్వరంగా సినిమాను పూర్తి చేస్తాం  అన్నారు. 

F3 shoots resume :

 Venkatesh - Varun Tej F3 shoots resume 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ