Advertisementt

తిమ్మరుసు జూలై 30న థియేటర్స్‌లో

Thu 08th Jul 2021 06:11 PM
thimmarusu movie press meet,thimmarusu movie,thimmarusu movie press meet photos,satyadev,mahesh koneru,priyanka jawalkar  తిమ్మరుసు జూలై 30న థియేటర్స్‌లో
Thimmarusu in theatres from July 30th తిమ్మరుసు జూలై 30న థియేటర్స్‌లో
Advertisement
Ads by CJ

బ్లఫ్‌ మాస్టర్‌, ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య వంటి చిత్రాలతో విల‌క్షణ క‌థానాయ‌కుడిగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటించిన చిత్రం తిమ్మరుసు. అసైన్‌మెంట్‌ వాలి ట్యాగ్‌లైన్. ప్రియాంక జ‌వాల్కర్ హీరోయిన్‌. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై మను వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన  నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తున్నారు. ఈ గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో.... 

హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో తిమ్మరుసు సినిమా కథ విన్నాను. నచ్చింది..నిర్మాతలు మహేశ్‌,సృజన్‌లతో మాట్లాడిన తర్వాత సినిమాను స్టార్ట్‌ అయ్యింది. అయితే డైరెక్టర్‌ శరణ్‌ కొప్పిశెట్టి చాలా సరదాగా అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. తనెలా డైరెక్ట్‌ చేస్తాడోనని చిన్న టెన్షన్‌ ఉండింది. అయితే కొన్ని రోజులు షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత, శరణ్‌ చాలా మంచి డైరెక్టర్‌ అని అర్థమైంది. తన డైరెక్షన్‌ పంథా ఏంటో తెలిసింది. చాలా కూల్‌గా ఉంటాడు. అప్పూ ప్రభాకర్‌ బ్యూటీఫుల్‌ విజువల్స్‌ అందించారు. ప్రియాంక జవాల్కర్‌ వండర్‌ఫుల్‌ కోస్టార్‌. చరణ్‌ ఎక్సలెంట్‌ సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందించారు. జూలై 30న మా తిమ్మరుసు చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. 

నిర్మాత మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ - తిమ్మరుసు సినిమాను చాలా చాలెంజింగ్‌ పరిస్థితుల్లో షూట్ చేశాం. అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు. ముఖ్యంగా సత్యదేవ్‌గారు కథ వినగానే యాక్ట్‌ చేయడానికి ఓకే చెప్పారు. అయితే కొవిడ్‌ పరిస్థితుల్లో షూటింగ్‌ను తగు జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి చేసే క్రమంలో సత్యదేవ్‌గారు ఇతర ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. సత్యదేవ్‌ లాయర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. అప్పు విజువల్స్‌, శ్రీచరణ్‌ మ్యూజిక్‌ సినిమాకు ఎస్సెట్‌గా నిలిచాయి. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది. జూలై 30న థియేటర్స్‌లో విడుదలయ్యే ఈ సినిమా కచ్చితంగా బెస్ట్‌ మూవీగా అందరి ప్రశంసలు అందుకుంటుంది అన్నారు. 

దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. చక్కగా వ్యుహాలు చేయడమే కాదు.. మంచి నిజాయతీగల వ్యక్తి. అలాంటి ఇంటెలిజెంట్‌ అయిన లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌గారు చేస్తున్న డిఫరెంట్‌ అటెంప్ట్‌. పరిచయమైన కొద్దిరోజుల్లో మంచి స్నేహితుడయ్యాడు. సినిమా పరంగా మంచి సపోర్ట్‌ అందించడంతో అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశాం. కొవిడ్‌ నేపథ్యంలో చాలా కేర్‌ తీసుకుని చాలెంజింగ్‌ సిట్యువేషన్స్‌లో పూర్తి చేసిన ఈ సినిమాను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్స్‌లో విడుదల చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలు మహేశ్‌ కోనేరు, సృజన్‌గారు ఎంతో సపోర్ట్‌ చేశారు. కష్టపడి తీశాం. థియేటర్‌లో చూడాల్సిన సినిమా అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీచరణ్‌ పాకాల, వైవా హర్ష, అంకిత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Thimmarusu in theatres from July 30th:

Thimmarusu press meet