Advertisementt

రవితేజ కి జోడిగా అందమైన హీరోయిన్స్

Mon 19th Jul 2021 01:24 PM
rajisha vijayan,mass maharaja ravi teja,sarath mandava,sudhakar cherukuri,ramarao on duty  రవితేజ కి జోడిగా అందమైన హీరోయిన్స్
Rajisha Vijayan and Divyansha Kaushik enters Ramarao on Duty రవితేజ కి జోడిగా అందమైన హీరోయిన్స్
Advertisement
Ads by CJ

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్‌ డ్యూటీ. రవితేజ కెరీర్‌లో 68వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా శరత్‌ మండవ దర్శకునిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌ ప్రభుత్వఅధికారిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి మరింత పెరిగడంతో పాటుగా అంచనాలు కూడా పెరిగాయి. రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రంలో ఒక్క రామారావుగా ఒక్క రవితేజ క్యారెక్టరే కాదు ఈ సినిమాలోని ప్రతిపాత్రకు ప్రాముఖ్యం ఉంది.

కథానుగుణంగా  రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. మజలీ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దివ్యాంశ కౌశిక్‌ ఇప్పటికే ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలోని మరో ప్రధానమైన హీరోయిన్‌ పాత్రకు మలయాళ నటి రాజీషా విజయన్‌ను చిత్రబృందం ఎంపిక చేసుకుంది. రాజీషకు తెలుగులో రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీ తొలి చిత్రం కావడం విశేషం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. కొన్ని రోజులుగా రవితేజ, దివ్యాంశ, రాజీషలపై సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా

రూపొందుతున్న ఈ డిఫరెంట్‌ థ్రిల్లర్‌కు ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు అసోసియేటై ఉన్నారు.

Rajisha Vijayan and Divyansha Kaushik enters Ramarao on Duty:

Rajisha Vijayan In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Ramarao On Duty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ