శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు రీసెంట్ గానే సెట్స్ మీదకి వెళ్ళింది. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
ప్రస్తుతం హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండనున్నాయని, కిశోర్ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.