Advertisementt

సుమంత్‌ కధ మ‌ళ్లీ మొద‌లైంది

Fri 30th Jul 2021 06:35 PM
malli modalaiydi,malli modalaiydi movie,sumanth,malli modalaiydi first look released  సుమంత్‌ కధ మ‌ళ్లీ మొద‌లైంది
Malli Modalaiydi First Look Released సుమంత్‌ కధ మ‌ళ్లీ మొద‌లైంది
Advertisement
Ads by CJ

సుమంత్‌, టీజీ కీర్తికుమార్‌, రెడ్ సినిమాస్ మ‌ళ్లీ మొద‌లైంది ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

గ‌త కొన్నిరోజులుగా సుమంత్ మ‌ళ్లీ పెళ్లిచేసుకోబోతున్నారు అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. దీనిపై హీరో సుమంత్ స్పందిస్తూ.. తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని.. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా డైవ‌ర్స్ మ‌రియు రీ మ్యారేజ్ కి సంభందించిన అంశాల‌తో కూడుకున్న‌ద‌ని, తెలుగులో ఇలాంటి క‌థతో మొద‌టిసారి ఓ సినిమా వ‌స్తుందని అందులో నుండే ఒక వెడ్డింగ్‌కార్డ్ లీకైంద‌ని వివ‌ర‌ణ ఇచ్చిన విష‌యం తెలిసిందే..

సుమంత్ హీరోగా న‌టిస్తున్న ఆ చిత్రానికి మ‌ళ్ళీ మొద‌లైంది అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. విడాకులు.. మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. నైనా గంగూలి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని రెడ్ సినిమాస్ ప‌తాకంపై కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో మొద‌టిఫోటోలో సుమంత్ - నైనా ఒకరినొక‌రు హత్తుకొని బెడ్ మీద పడుకొని ఉండ‌డం  అలాగే రెండో ఫోటోలో వారిద్ద‌రి మ‌ధ్య దూరం మరింత పెరిగినట్లు చూపించారు. విడాకుల తర్వాత జీవితాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారనేది ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడు. జీఆర్ఎన్ సినిమాటోగ్రాఫ‌ర్. మ‌ళ్ళీ మొద‌లైంది చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

తారాగ‌ణం: సుమంత్‌, నైనా గంగూలి, సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి

సాంకేతిక వ‌ర్గం: ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టీజీ కీర్తి కుమార్‌, నిర్మాత‌: కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి, సంగీతం: అనూప్ రూబెన్స్‌, ఎడిటింగ్: ప్ర‌దీప్ ఇ రాఘ‌వ్‌, ఆర్ట్‌: అర్జున్ సురిశెట్టి, సీఈఒ: చ‌ర‌ణ్ తేజ్‌, పీఆర్ఓ: వంశీ - శేఖ‌ర్‌. 

Malli Modalaiydi First Look Released:

Malli Modalaiydi Movie First Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ