Advertisementt

ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ కి అలా..

Tue 03rd Aug 2021 03:13 PM
aadavaallu meeku johaarlu movie,sharwanand,khushbu,radhika sarathkumar,urvashi  ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ కి అలా..
Khushbu, Radhika Sarathkumar, Urvashi In Aadavaallu Meeku Johaarlu ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ కి అలా..
Advertisement
Ads by CJ

యంగ్ అండ్ హ్యీపెనింగ్ హీరో శ‌ర్వానంద్, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన‌ప్పుడు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌హిళల‌ గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసేలా ఉన్న ఈ టైటిల్‌ను చూసి.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి టైటిల్ బావుందంటూ ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఈ చిత్రంలో ఎవ‌ర్ గ్రీన్ ఆర్టిస్టులు ఖుష్బూ, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ఊర్వ‌శి భాగ‌మ‌య్యార‌ని లేటెస్ట్‌గా నిర్మాత‌లు తెలియ‌జేశారు.

సినిమాలో ముగ్గురు మ‌హిళ‌ల పాత్ర ఎంతో కీల‌కంగా ఉండ‌టంతో ఆ పాత్ర‌ల‌ను చేయ‌డానికి చాలా అనుభ‌వం, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవ‌స‌రం కావ‌డంతో మేక‌ర్స్..ఖుష్బూ, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ఊర్వ‌శిల‌ను ఆ పాత్ర‌ల‌కు ఎంపిక చేసుకున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ పాత్ర‌ల‌ను ఈ ప్ర‌త్యేక‌మైన సినిమాలో ప్ర‌త్యేకంగా మ‌లిచారు డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్నషూటింగ్‌లో వీరు ముగ్గ‌రు జాయిన్ అయ్యారు.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అదిస్తున్నారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ చేస్తున్న ఈ చిత్రానికి ఎడిట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ప‌నిచేస్తున్నారు.

Khushbu, Radhika Sarathkumar, Urvashi In Aadavaallu Meeku Johaarlu:

Aadavaallu Meeku Johaarlu Movie update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ