వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెగాప్రిన్స్‌గా ప్రేక్షకాభిమానులను మెప్పిస్తోన్న కథానాయకుడు వరుణ్‌తేజ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం గని. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...
నిర్మాతలు మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత హైదరాబాద్‌లో భారీ సెట్ వేసి గని సినిమా ఫైనల్ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌గారు తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. రీసెంట్‌గా ఆయన లుక్, ఎక్సర్‌సైజ్ ప్రోమోలకు ఫ్యాన్స్, ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు హాలీవుడ్ చిత్రం టైటాన్స్, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మిస్తున్నాం. సినిమా అంతా అనుకున్న ప్లాన్ ప్రకారం చక చకా పూర్తవుతుంది. ఈ ఏడాది దీపావళి సందర్బంగా మా గని సినిమాను భారీ రేంజ్‌లో విడుదల చేస్తాం అన్నారు.