Advertisementt

BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల

Sun 08th Aug 2021 03:04 PM
bro first look,bro,naveen chandra,avika  BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల
BRO has released the movie First Look BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల
Advertisement
Ads by CJ

BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరోయిన్ రష్మిక మందన

ఎన్నో హిట్ సినిమాలలో నటించిన హీరో,హీరోయిన్ లు ఈ మధ్య కథకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కథ బలంగా ఉంటే వారి క్యారెక్టర్ గురించి ఆలోచించరు. ఇప్పుడు అదే కోవలో కథకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఇప్పుడు నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెలుగా నటిస్తుండడం విశేషం. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో జెజెఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నవీన్ చంద్ర, అవికా గోర్, సంజన సారథి, సాయి రోనక్ నటీనటులుగా కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో జె.జె.ఆర్. రవిచంద్ నిర్మిస్తున్న చిత్రం BRO. నవీన్ చంద్ర, అవికాగోర్ లు అన్న, చెల్లెలుగా నటిస్తున్న వీరిద్దరి ఫస్ట్ లుక్ ను ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన విడుదల చేసింది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత  జె.జె.ఆర్ రవిచంద్ మాట్లాడుతూ.. హీరోయిన్ రష్మిక మందన ఎంతో బిజీగా వున్నా మేము అడిగిన వెంటనే మా BRO చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు మా టీం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తను లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే  నవీన్ చంద్ర, అవికాగోర్ ల లుక్ చూసి చాలమంది స్టోరీ ఎంటని ఫోన్స్ చేస్తున్నారు. ఈ స్టోరీలో అన్న, చెల్లెలుగా నటిస్తున్నారు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ చిత్రం, అన్నయ్య చెల్లెలు మధ్య జరిగే ఓ మంచి ఎమోషనల్ ఫాంటసీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎంతో క్యూరియాసిటీగా డీఫ్రెంట్ గా ఉంటుంది. హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ లో నటించే అవికాగోర్ నవీనచంద్ర కు చెల్లెలు గా నటించడానికి ఒప్పుకోవడం. అలాగే ఎన్నో మంచి మంచి హిట్లు ఇచ్చిన నవీన్ చంద్ర హీరోయిన్ కు అన్న క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. హీరో,హీరోయిన్ గా చేసే  వీరిద్దరూ అన్న ,చెల్లెలుగా నటించడానికి ఒప్పుకున్నారంటే ఈ కథ ఎంత బలమైందో మీకే అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని వైజాగ్ తదితర అందమైన ప్రదేశాలలో షూట్ చేయడం జరిగింది. మంచి విజువల్స్ మరియు మ్యూజిక్ తో  తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి.త్వరలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తామని అన్నారు.

నటీనటులు: నవీన్ చంద్ర, అవికాగోర్, సంజన సారథి, సాయి రోనక్.

సాంకేతిక నిపుణులు: సినిమా పేరు:- BRO, ప్రెజెంట్స్:- మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్, ప్రొడక్షన్ - జెజెఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత - జెజెఆర్ రవిచంద్, డైరెక్టర్ - కార్తీక్ తుపురాణి, లైన్ ప్రొడ్యూసర్:-కేదరిసిపల్లి శ్రీను, సినిమాటోగ్రఫీ - అజీమ్ మహ్మద్, సంగీత దర్శకుడు - శేఖర్ చంద్ర, ఎడిటర్ - విప్లవ్ నైషాదం సాహిత్యం - భాస్కరభట్ల, ఆర్ట్స్ :- ఏ.యస్. ప్రకాష్, కోరియోగ్రఫీ - భాను మాస్టర్, అనీష్ మాస్టర్, పృథ్వీ మాస్టర్, యాక్షన్ :- రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎక్స్‌క్యూటివ్ - సుబ్రమణ్యం ధీతి, పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్.

BRO has released the movie First Look:

BRO has released the movie First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ