Advertisementt

మధిని టచ్ చేసే.. క్షీర సాగర మథనం

Sun 08th Aug 2021 04:55 PM
ksheera sagara madhanam,ksheera sagara madhanam movie,ksheera sagara madhanam movie review,manas,  మధిని టచ్ చేసే.. క్షీర సాగర మథనం
ksheera sagara madhanam movie review మధిని టచ్ చేసే.. క్షీర సాగర మథనం
Advertisement
Ads by CJ

శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ పతాకంపై డెబ్యూ డైరెక్టర్ అనిల్ పంగులూరి తెరకెక్కించిన చిత్రం క్షీర సాగర మథనం. మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్. ప్రదీప్ రుద్ర విలన్ గా నటించారు. ఇతర పాత్రల్లో చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు కనిపించారు. కష్టాలకు భయపడి ఆగిపోతే జీవన మకరందాన్ని ఆస్వాదించలేం.. జీవితంలో ఏమీ సాదించలేమనే సారంతో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి.కథ: రిషి(మానస్ నాగులపల్లి), ఓంకార్(సంజయ్ కుమార్) మరో ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఓ పార్టీకి పిలిచి.. విలన్(ప్రదీప్ రుద్ర) వారి శరీరంలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఓ డివైజ్ ను అమర్చి.. ఆ ఐదు మందిని మానవ బాంబులుగా మార్చి.. భారీ పేలుడుకు పక్కా ప్లాన్ వేస్తాడు. ఈ ఐదుగురు కూడా వాళ్ల వాళ్ల సొంత సమస్యలతో బాధపడుతూ.. వుండగా.. ఈ మానవ బాంబుగా మారిపోయామని తెలుసుకుని చివరకు ఏమి చేశారన్నదే మిగతా కథ.

కథ.. కథనం విశ్లేషణ: ఏడు పాత్రల భావోద్వేగాలతో ముడిపడిన ఈ చిత్రం.. ఆద్యంతో ప్రేక్షకుల్ని ఆలోచింప జేసేలా ముందుకు వెళుతూ వుంటుంది. క్యారెక్టర్.. వర్జినిటీ ఒక్కటే అయితే.. డిక్ష్ణరిలో ఎందుకు ఈ రెండు పదాలు వుంటాయి.. అమ్మాయిల క్యారెక్టర్ పై నేటి సమాజంలో ఎక్కువగా వినిపిస్తున్న ఇలాంటి పదాలకు సమాధానం చెప్పడంలో భాగంగా రాసుకున్న ఇటువంటి పదునైన మాటలతోనూ.. టీ.. బజ్జీ.. దోసెలనైనా అమ్ముకుంటా గానీ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం మాత్రం చేయనే నేటి సాఫ్ట్ వేర్ వుద్యోగుల పని ఒత్తిడినీ.. ఎంతో టాలెంట్ వున్నా.. దాన్ని సక్రమ మార్గంలో వుపయోగించకుండా చెడు మార్గంలో పయనించే విలన్ క్యారెక్టరైజేషన్.. తదితర వాటినన్నింటినీ ఎంతో గ్రిప్పింగ్ కథ.. కథనాలతో ముందుకు నడిపించి.. ప్రేక్షకులను ఉత్కంఠతకు లోను అయ్యేలా చేశారు దర్శకుడు అనిల్ పంగులూరి. తను చెప్పాలనుకున్న విషయంలో ఎక్కడా డీవియేట్ కాకుండా తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యారు. 

ఎన్ని కష్టాలొచ్చినా.. వాటిని ధైర్యంగా ఫేస్ చేసి ముందుకు సాగాలనే కాన్సెప్ట్ తో కథ.. కథనాలను నడిపించిన తీరు.. కొంత ఎంటర్టైనింగ్ గానూ.. భావోద్వేగాలతోనూ నడిపించారు. ఎక్కడా బోరింగ్ లేకుండా విషయాన్ని సుత్తి లేకుండా చెప్పడానికి ట్రై చేశారు. మొదట్లో కథలోకి వెళ్లడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నా.. ఆ తరువాత సినిమా వేగం పుంజుకుంటుంది. గోవింద్.. వ్రిందాల మధ్య వచ్చే సీన్స్ గానీ.. రిషి.. ఇషికల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఎపిసోడ్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. భరత్ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా వుంది. సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతో టాలెంట్ వున్నా.. టీ కొట్టు గానీ.. బజ్జి కొట్టుగానీ పెట్టుకుంటా గానీ.. ఈ సాప్ట్ వేర్ జాబ్ మాత్రం చేయాలేనని చెప్పే భరత్ క్యారెక్టర్.. నేటి సాప్ట్ వేర్ వుద్యోగులు ఎదుర్కొంటున్న జాబ్ ఒత్తిడిని ఎలివేట్ చేస్తుంది. బహుషా.. దర్శకుడు అనిల్ సాఫ్ట్ వేర్ రంగానికి  చెందిన వారు కావడంతోనే అనుకుంటా.. ఆ రంగంలో వున్న ఒడుదొడుకులను బాగా చర్చించారు ఇందులో ఎంతో కమిట్ మెంట్ తో ఓ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేస్తే.. వాళ్ల బాస్ మాత్రం ఆ క్రెడిట్ తనకు సంబంధించిన కులం వాళ్లకు ఇవ్వడానికి ట్రై చేయడం లాంటి సీన్లన్నీ.. నేటి సాఫ్ట్ వేర్ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పడుతాయి. ఇలాంటి చాలా విషయాలనే దర్శకుడు ఇందులో చూపించారు. వాటితో పాటు.. ఆధునిక పోకడలను కూడా అక్కడక్కడ చూపించి నవ్వించారు. 

ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ వున్న.. సెకెండ్ హాఫ్ చాలా వేగంగా ముందుకు సాగుతుంది.దర్శకుడు అనిల్ ఈ చిత్రాన్ని తన సాఫ్ట్ వేర్ మిత్ర బృదం ప్రోత్సాహంతో తెరకెక్కించారు. దర్శకుడు ఎంచుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. ఈ చిత్రం అతనికి డెబ్యూనే అయినా.. మంచి గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు. ఇందులో సాఫ్ట్వేర్ వాళ్లనే కాకుండా.. సెన్సిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరినీ టచ్ చేసేలా ప్రతి సీన్ ను తెరమీద చూపించారు. ఏడు పాత్రల తాలూకు భావోద్వేగ సంఘర్షణల మథనానికి  క్షీర సాగర మథనం అనే అందమైన టైటిల్ ని కూడా నిర్ణియంచి ప్రేక్షకుల అటెన్షన్ ని మరింత గ్రాబ్ చేశారు దర్శకుడు. దర్శకుడి ప్రతిభకు సినిమాటోగ్రఫీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్  అదనపు బలం. దర్శకుడి విజువలైజేషన్ కు వీరు ప్రాణం పోసారు. దాంతో సినిమా రిచ్ గా కనబడుతుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇంకాస్త క్రిస్ప్ గా వుంటే బాగుంది. ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు.                                                                                                                 ADVT

ksheera sagara madhanam movie review:

ksheera sagara madhanam movie review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ