Advertisementt

మాస్ట్రో బ్రాండ్ న్యూ పోస్టర్

Sun 15th Aug 2021 01:57 PM
maestro,maestro movie,nithiin,tamannaah,maestro poster,direction merlapaka gandhi,producers n sudhakar reddy,nikitha reddy,music director mahati swara sagar,maestro telugu movie  మాస్ట్రో బ్రాండ్ న్యూ పోస్టర్
Brand New Poster From Maestro మాస్ట్రో బ్రాండ్ న్యూ పోస్టర్
Advertisement
Ads by CJ

మాస్ట్రో నుంచి నితిన్, తమన్నా కాంబినేషన్‌లో బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల

హీరో నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా.. నితిన్ కు ల్యాండ్ మార్క్‌ 30వ చిత్రం. నితిన్.. హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటిస్తున్నారు. నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ నితిన్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. మాస్ట్రో టీమ్ నుంచి విడుద‌లైన త‌మ‌న్నా తొలి లుక్ ఇదే. పోస్టర్‌ను గమనిస్తే.. న‌ల్ల‌క‌ళ్ల‌ద్దాల‌తో భ‌య‌ప‌డుతూ నిల్చున్న నితిన్‌, అత‌ని ప‌క్క‌నే గ‌న్ ప‌ట్టుకుని నిల‌బ‌డ్డ త‌మ‌న్నా కాంబినేషన్‌లో చూడటానికి చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది.

ఇప్ప‌టికే మాస్ట్రో నుంచి విడుద‌లైన వెన్నెల్లో ఆడపిల్ల.., బేబీ ఓ బేబీ.. అనే సాంగ్స్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వై.యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి మాస్ట్రో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు: నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి.

సాంకేతిక విభాగం: డైరెక్షన్, డైలాగ్స్‌: మేర్లపాక గాంధీ, నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, బ్యానర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌, సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకేళ్ళ, మ్యూజిక్‌ డైరెక్టర్‌: మహతి స్వరసాగర్‌, డీఓపీ: జె యువరాజ్‌, ఎడిటర్‌: ఎస్‌ఆర్‌ శేఖర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్‌.

Brand New Poster From Maestro:

Nithiin, Tamannaah’s Brand New Poster From Maestro Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ