Advertisementt

101 జిల్లాల అంద‌గాడు.. ఓ అల‌సిన సంచారి..

Thu 19th Aug 2021 07:51 PM
101 jillala andagadu,101 jillala andagadu movie,101 jillala andagadu song out now,avasarala srinivas,ruhani sharma,101 jillala andagadu spt 3rd release  101 జిల్లాల అంద‌గాడు.. ఓ అల‌సిన సంచారి..
101 jillala andagadu Song Out Now 101 జిల్లాల అంద‌గాడు.. ఓ అల‌సిన సంచారి..
Advertisement
Ads by CJ

101 జిల్లాల అంద‌గాడు నుంచి ఓ అల‌సిన సంచారి.. వీడియో సాంగ్ రిలీజ్

ఓ అల‌సిన సంచారి

ప‌రుగులు ఏ దారి

నిల‌బ‌డు ఓసారి

ఈ బ‌తుక‌ను మారాసి

అల‌జ‌డి రాజేసి

అడుగిడ నీకేసి

నీ క‌ల‌ల‌ను కాజేసి..

అంటూ దూర‌మైన ప్రేయ‌సి రుహానీ శ‌ర్మ‌ జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటున్నారు హీరో అవ‌స‌రాల శ్రీనివాస్. ఇంత‌కీ వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది.. ఎందుకు మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చాయి అనే సంగ‌తి తెలుసుకోవాలంటే మాత్రం సెప్టెంబర్ 3న విడుద‌ల కాబోతున్న 101 జిల్లాల అంద‌గాడు సినిమా చూడాలంటున్నారు చిత్ర యూనిట్ స‌భ్యులు. ద‌ర్శ‌కుడిగా వైవిధ్య‌మైన సినిమాలను తెర‌కెక్కిస్తూ.. న‌టుడిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తున్న అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం 101 జిల్లాల అంద‌గాడు. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి  నిర్మించారు. గురువారం ఈ సినిమా నుంచి ఓ అల‌సిన సంచారి.. పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ పాట‌ను శ్రీ విశ్వ రాయ‌గా, హేమ చంద్ర పాడారు. 

ఇది వ‌ర‌కే .. ఈ సినిమాకు సంబంధించిన వీడియో ప్రోమో, టీజ‌ర్‌, టైటిల్ సాంగ్‌తో పాటు మనసా వినవా.. లిరిక‌ల్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క్రియేట్ అయ్యింది. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా,సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ 101 జిల్లాల‌ అంద‌గాడు చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌ను అందించారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ, శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. 

న‌టీన‌టులు: అవ‌స‌రాల శ్రీనివాస్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు. 

సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌, స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు, జాగ‌ర్ల‌మూడి క్రిష్‌, నిర్మాత‌లు: శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి, ర‌చ‌యిత‌: అవ‌స‌రాల శ్రీనివాస్‌, సినిమాటోగ్ర‌ఫీ: రామ్‌, ఎడిట‌ర్‌: కిర‌ణ్ గంటి, సంగీతం: శ‌క్తికాంత్ కార్తీక్‌, ఆర్ట్‌: ఎ.రామాంజ‌నేయులు, డిజైన‌ర్‌: ఐశ్వ‌ర్యా రాజీవ్.

101 jillala andagadu Song Out Now:

101 jillala andagadu Spt 3rd Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ