Advertisementt

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌ ఫ్యామిలీ పోస్ట‌ర్‌

Thu 19th Aug 2021 08:33 PM
writer padmabhushan,writer padmabhushan poster released,suhas,ashish vidyarthi,rohini,writer padmabhushan ready for release in october  రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌ ఫ్యామిలీ పోస్ట‌ర్‌
Writer Padmabhushan Family Poster Released రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌ ఫ్యామిలీ పోస్ట‌ర్‌
Advertisement
Ads by CJ

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌ కుటుంబాన్ని ప‌రిచ‌యం చేసిన సుహాస్‌

క‌ల‌ర్‌ఫోటో చిత్రంతో హీరోగా తొలి స‌క్సెస్ అందుకున్న సుహాస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ చిత్రాల్లో రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్ ఒక‌టి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంది. ఓ సాంగ్ మిన‌హా ఎంటైర్ షూటింగ్ పూర్త‌య్యింది. కొత్త ఏడాది సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఇప్పుడు సుహాస్ పుట్టిన‌రోజు సంర‌ద్భంగా రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌ ఫ్యామిలీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. సుహాస్ తండ్రి పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ఆశిష్ విద్యార్థి, త‌ల్లి పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టి రోహిణి నటిస్తున్నారు. ఈ బ‌ర్త్ డే స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఇందులో అంద‌రూ సెల‌బ్రేష‌న్స్ మూడ్‌లో క‌నిపిస్తున్నారు.

ష్మ‌ణుఖ ప్ర‌శాంత్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో సుహాస్ అనేక ఇబ్బందులు ప‌డే రైట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మ‌నోహర్ గోవింద స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో చాయ్ బిస్క‌ట్ ఫిల్మ్స్‌, ల‌హ‌రి ఫిల్మ్స్ ప‌తాకాల‌పై అనురాగ్‌, శ‌ర‌త్‌, చంద్రు మ‌నోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్రాఫ‌ర్‌. అక్టోబ‌ర్‌లో సినిమా విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

న‌టీన‌టులు: సుహాస్‌, ఆశిష్ విద్యార్థి, రోహిణి త‌దిత‌రులు. 

సాంకేతిక వ‌ర్గం: ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: షణ్ముఖ ప్ర‌శాంత్‌, నిర్మాత‌లు: అనురాగ్‌, శ‌ర‌త్‌, చంద్రు మ‌నోహ‌ర్‌, స‌మ‌ర్ప‌ణ‌: మ‌నోహ‌ర్ గోవింద‌స్వామి, బ్యాన‌ర్స్‌: చాయ్ బిస్క‌ట్ ఫిల్మ్స్‌, ల‌హ‌రి ఫిల్మ్స్‌,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సూర్య చౌద‌రి, సంగీతం: శేఖర్ చంద్ర‌, సినిమాటోగ్ర‌పీ: వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి, ఎడిట‌ర్‌: రామకృష్ణ అర్ర‌మ్‌, ఆర్ట్‌: ఎల్ల‌య్య‌.ఎస్‌, పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌.

Writer Padmabhushan Family Poster Released:

Writer Padmabhushan ready for release in October

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ