పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మలయాళ హిట్ ఫిలిం అయ్యప్పన్ కోషియం రీమేక్ భీమ్లా నాయక్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. యాక్షన్ మోడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. మరోపక్క రానా ఈగో వలన ఆవేశంతో పవన్ ని ఇబ్బంది పెట్టే పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఇప్పటికే భీమ్లా నాయక్ టీజర్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచగా.. మరో టీజర్ రానా మీద వదలబోతున్నట్టుగా టాక్ ఉంది.
ఇక ఈ సినిమా త్రివిక్రమ్ హాండ్స్ నుండి తెరకెక్కుతుంది. త్రివిక్రం ఈ సినిమాకి డైలాగ్స్ లాంటివి, అలాగే మరే ఇతర పనులు చేస్తున్నారో తెలియదు కానీ సినిమా షూటింగ్ స్పాట్ నుండి మాత్రం త్రివిక్రమ్ కదలడం లేదు. దానితో సినిమాపై మరింత క్రేజ్ మొదలైంది. అయితే అదే క్రేజ్ తో భీమ్లా నాయక్ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ ఓటిటి భారీ ధరకు వెచ్చించి కొనేసింది అని, అది కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ఫిగర్ ఎంత అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఇంతకుముందు వకీల్ సాబ్ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటిటి వారే భారీ ధరకు కొనేసింది విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు భీమ్లా నాయక్ రైట్స్ ని అమెజాన్ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది.