విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైన విజయ్ సేతుపతి, తాప్సీ అనబెల్ & సేతుపతి ట్రైలర్
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్ పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్న సినిమా అనబెల్ & సేతుపతి. దీపక్ సుందరరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది. ట్రైలర్ సాంతం చాలా ఆసక్తికరంగా ఉందంటూ మెచ్చుకున్నారు వెంకటేష్. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు ఈయన. ఒకేసారి మూడు భాషల ట్రైలర్స్ విడుదల చేసారు మేకర్స్. తమిళంలో సూర్య.. మలయాళంలో మోహన్ లాల్ ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు. సెప్టెంబర్ 17 హాట్ స్టార్ డిస్నీలో నేరుగా అనబెల్ & సేతుపతి చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ అంతా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంది. విజయ్ సేతుపతి, తాప్సీ చుట్టూనే తిరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెనకాల బంగ్లా ఒకటి బాగా ఫోకస్ చేశారు. పోస్టర్ ఆన్ రివర్స్ లో చూస్తే మిగిలిన నటీనటులను పరిచయం చేశారు. పోస్టర్‌లో హారర్ థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే ట్రైలర్ నిండా కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది ఓటీటీలో విడుదలయ్యే సినిమాలలో అనబెల్ & సేతుపతి కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, యోగి బాబు, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
నటీనటులు: విజయ్ సేతుపతి, తాప్సీ, రాధిక శరత్ కుమార్, యోగి బాబు, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, వెన్నెల కిషోర్ తదితరులు.
టెక్నికల్ టీం: కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: దీపక్ సుందరరాజన్, నిర్మాతలు: సుధాన్ సుందరం, జి జయరాం, బ్యానర్: ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్, PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.