Advertisementt

రొమాంటిక్ చిత్రానికి U/A సర్టిఫికెట్‌

Sat 04th Sep 2021 05:45 PM
romantic movie,akash puri romantic,akash puri,ketika sharma,ramyakrishna,makarand deshpande,uttej,sunaina,puri jagannadh,charmme kaur  రొమాంటిక్ చిత్రానికి U/A సర్టిఫికెట్‌
Romantic Completes Censor With U/A Certificate రొమాంటిక్ చిత్రానికి U/A సర్టిఫికెట్‌
Advertisement
Ads by CJ

ఆకాశ్ పూరి రొమాంటిక్ చిత్రానికి U/A సర్టిఫికెట్‌..త్వ‌ర‌లో థియేట‌ర్స్‌లో విడుద‌ల‌

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరి తదుపరి చిత్రం రొమాంటిక్ కోసం కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్‌లపై పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో కేతికా శర్మను ఆకాష్ వెన‌క నుండి కౌగిలించుకోవడం చూడొచ్చు. ఇది సినిమా టైటిల్‌ను జ‌స్టిఫై చేస్తుంది. త్వ‌ర‌లో ఈ మూవీని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నారు మేక‌ర్స్‌.

రమ్య‌కృష్ట ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఇంటెన్స్ రొమింటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునిల్ కశ్య‌ప్ సంగీతం అందించారు. న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన పాటలకు విశేష‌ స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజైన అన్ని పోస్టర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాపై మంచి బ‌జ్‌ని క్రియేట్ చేశాయి.

తారాగ‌ణం: ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ట‌, మ‌క‌రంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్‌, సునైన‌.

సాంకేతిక వ‌ర్గం: క‌థ‌,స్క్రీన్‌ప్లే,డైలాగ్స్: పూరిజగ‌న్నాధ్, ద‌ర్శ‌కత్వం: అనిల్ పాదూరి, నిర్మాత‌లు: పూరిజ‌గ‌న్నాధ్‌, ఛార్మీ కౌర్‌, స‌మ‌ర్ప‌ణ‌: లావ‌ణ్య‌, బేన‌ర్స్‌: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్, సంగీతం: సునిల్ క‌శ్య‌ప్‌, సినిమాటోగ్ర‌ఫి: న‌రేష్‌, ఎడిట‌ర్: జునైద్ సిద్దిఖీ, ఆర్ట్‌:  జానీ షేక్‌, లిరిక్స్‌: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఫైట్స్: రియల్ స‌తీష్‌, పిఆర్ఓ: వంశీ - శేఖ‌ర్.

Romantic Completes Censor With U/A Certificate:

Akash Puri Romantic Completes Censor With U/A Certificate

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ