Advertisementt

బండ్ల గణేష్ లుక్, యాక్టింగ్ సర్‌ప్రైజ్!

Sat 04th Sep 2021 06:47 PM
bandla ganesh,oththa seruppu size 7,swathi chandra,art director ghandi,arun devineni,dialogues marudhuri raja,music linus madiri  బండ్ల గణేష్ లుక్, యాక్టింగ్ సర్‌ప్రైజ్!
Film with Bandla Ganesh as the hero kickstarts shooting బండ్ల గణేష్ లుక్, యాక్టింగ్ సర్‌ప్రైజ్!
Advertisement
Ads by CJ

బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ షురూ..

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

ఈ సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ తమిళ హిట్ ఒత్తు సెరుప్పు సైజ్ 7కి‌ రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం అని చెప్పారు. 

ఒత్తు సెరుప్పు సైజ్ 7 ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

ఈ చిత్రానికి ఈ చిత్రానికి కళా దర్శకత్వం: గాంధీ, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: లైనస్ మధిరి, దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర. 

Film with Bandla Ganesh as the hero kickstarts shooting:

Hero Bandla Ganesh movie shooting Start

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ