Advertisementt

బాలీవుడ్ స్టార్స్‌కు బాలు మున్నంగి సెంటిమెంట్

Sun 05th Sep 2021 09:32 PM
telugu astro md balu munnangi,bollywood stars,karan johar,ajay devgn,sanjay dutt,siddharth malhotra  బాలీవుడ్ స్టార్స్‌కు బాలు మున్నంగి సెంటిమెంట్
Bollywood stars listen to Telugu Astro MD Balu Munnangi advices బాలీవుడ్ స్టార్స్‌కు బాలు మున్నంగి సెంటిమెంట్
Advertisement
Ads by CJ

Bollywood stars listen to Telugu Astro MD Balu Munnangi  advices

Bollywood stars listen to Telugu Astro MD Balu Munnangi advices:

బాలీవుడ్ స్టార్స్‌కు తెలుగు ఆస్ట్రో ఎండీ బాలు మున్నంగి సెంటిమెంట్ సినిమాలో 24 శాఖలు ఉంటాయి. ఆయా శాఖల్లో పని చేసిన వ్యక్తుల పేర్లు టైటిల్ కార్డ్స్‌లో వేస్తారు. థాంక్స్ కార్డ్స్, లీగల్ అడ్వైజర్/కన్సల్టెంట్స్ పేర్లు వీటికి అదనం. ఇప్పుడు కొత్తగా మరో కార్డ్ వచ్చింది. అదే ఆస్ట్రో కన్సల్టెంట్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన హిట్ సినిమా షేర్షా చూశారా? అందులో ఆస్ట్రో కన్సల్టెంట్ బాలు మున్నంగి అని పేరు పడింది. షేర్షా నిర్మాత, ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ గతంలో ఒకసారి జ్యోతిషం పరంగా తనకు సలహాలు ఇస్తూ, మద్దతుగా నిలుస్తున్నందుకు బాలు మున్నంగికి థాంక్స్ చెప్పారు. దాంతో ఎవరీ బాలు మున్నంగి? అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. కరణ్ జోహార్ నుండి బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సిద్ధార్థ్ మల్హోత్రా వరకూ.. షేర్షా దర్శకుడు విష్ణువర్థన్ మొదలుకుని పలువురు హిందీ సినిమా ప్రముఖులకు బాలు మున్నంగి అంటే గురి. సినిమా ప్రారంభోత్సవాలు, పనులకు ఆయన చేత ముహూర్తాలు పెట్టించుకుని ముందడుగు వేస్తారు. అజయ్ దేవగణ్ తనాజీ చిత్రానికి బాలు మున్నంగి పెట్టిన ముహూర్తాలను ఫాలో అయ్యారు. అలాగే, మే డేకి కూడా! తానాజీ తర్వాత ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ చేస్తున్న దర్శకుడు ఓం రౌత్ సైతం, బాలు మున్నంగిని ఫాలో అవుతున్నారు. ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమారాలజీలలో ఇరవై మూడేళ్ల సుదీర్ఘ అనుభవమున్న తెలుగువాడు బాలు మున్నంగి కోసం ఇప్పుడు బాలీవుడ్ తారలు, డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన బాలు మున్నంగికి ఇప్పుడు హిందీ చిత్రసీమ నీరాజనాలు పలుకుతోంది. ఇంకా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్వదేశీ, విదేశీ రాజకీయ నేతలు కూడా బాలు మున్నంగి జోస్యాన్ని గట్టిగా నమ్ముతున్నారు. బాలు మున్నంగి ప్రిడిక్షన్స్ అన్ రియల్ అంటూ ఆయన సన్నిహిత మిత్రుడు, హీరో అజయ్ దేవగణ్ అంటే.. ఆయన చెప్పినవి ఫాలో అవడం వల్ల తనకొచ్చిన క్యాన్సర్ కూడా నయమైందని సంజయ్ దత్ చెప్పారు. స్టార్స్ ఇద్దరు చెప్పిన మాటలను బట్టి బాలు మున్నంగి భవిష్యవాణి ఎంతమంచిదో అర్థమవుతుంది. పలువురు తెలుగు ప్రముఖులు సైతం బాలు మున్నంగి అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీ సైతం బాలు మున్నంగి ని ఫాలో అవుతుండడం విశేషం. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్, లైబీరియా ప్రెసిడెన్షియల్ అభ్యర్థి మెక్ డెల్లా కూపర్ లాంటి విదేశీ రాజకీయ ప్రముఖులు సైతం ఆయనను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతూ.. సలహాలు సూచనలు తీసుకోవడం విశేషం. తెలుగు ప్రముఖులు సైతం.. బాలు మున్నంగి ఎంతో మంది తెలుగు ప్రముఖులకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా ఎదుగుతున్నారు. తమ రంగాల్లో వృత్తిపరమైన, వ్యక్తిగతమైన సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. వీరిలో ప్రముఖంగా సీనియర్ నటి రమ్యకృష్ణ దగ్గర్నించి సమంత, రష్మీక,  లావణ్య త్రిపాఠి, నేహా శెట్టి, పూర్ణ, మోనల్ గజ్జర్, కెథరీన్, చార్మీ.. డైరెక్టర్స్ కృష్ణవంశీ, హరీష్ శంకర్, మెహర్ రమేష్, పూరీ జగన్నాధ్, వైవీస్ చౌదరి.. ఇలా చెప్పుకొంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల్లో ప్రముఖులు ఆయన సలహాలు తీసుకుంటున్నారు. బాలు మున్నంగి ఇంస్టాగ్రామ్ పేజీ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతమంది దేశ, విదేశాల ప్రముఖులు ఆయన చెప్పే విషయాలతో ఏకీభవిస్తూ.. అనుసరిస్తున్నారంటే తెలుగు వారిగా మనం గర్వపడే విషయం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ