Advertisementt

భగీరథకు అక్కినేని జీవన సాఫల్య అవార్డు

Tue 14th Sep 2021 06:53 PM
bhagiratha,journilist bhagiratha,bhagiratha akkineni life achievement award,akkineni life achievement award,shrutilaya arts academy  భగీరథకు అక్కినేని జీవన సాఫల్య అవార్డు
Akkineni Life Achievement Award for Bhagiratha భగీరథకు అక్కినేని జీవన సాఫల్య అవార్డు
Advertisement
Ads by CJ

అక్కినేని జీవన సాఫల్య అవార్డుకు భగీరథ ఎంపిక

పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరావు పేరిట శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేసిన ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారానికి ఈ సంవత్సరం సీనియర్ పాత్రికేయుడు భగీరథ ను ఎంపిక చేశామని అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు.

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ గత రెండు దశాబ్దాలుగా ప్రతి నెల హైదరాబాద్ రవీంద్రభారతి లో సినీ సంగీత విభావరి లు నిర్వహిస్తూ ఎందరో సినీ ప్రముఖులను, సేవా మూర్తులను సత్కరిస్తూ యువతరానికి స్ఫూర్తినిస్తోందని, ఈ సంస్థ నిర్వాహకురాలు, గాయకురాలు శ్రీమతి ఆమని గారు తెలంగాణ ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ లో ఉన్నతాధికారిణిగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.   

2001వ సంవత్సరంలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థ ను డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు  రవీంద్రభారతి  ప్రారంభించారని, అందుచేత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట వారి పుట్టిన రోజు సెప్టెంబర్ 20న పాత్రికేయులను సత్కరిస్తూ వస్తున్నామని, ఈ ఏడాది అక్కినేని శృతిలయ ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారం కోసం, సినిమా పాత్రికేయునిగా నాలుగు దశాబ్దాల అనుభవం, ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ భగీరథ గారిని ఎంపిక చేయడం జరిగిందని మహ్మద్ రఫీ. ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగే అక్కినేని జయంతి ఉత్సవాల్లో భగీరథ గారిని సత్కరించి అక్కినేని జీవన సాఫల్య అవార్డును ప్రదానం చేస్తామని డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు.

Akkineni Life Achievement Award for Bhagiratha:

Bhagiratha nominated for Akkineni Life Achievement Award

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ