Advertisementt

4న ఆకాష్ పూరి రొమాంటిక్

Sat 25th Sep 2021 03:57 PM
romantic,romantic movie,akash puri romantic movie,akash puri,ketika sharma,ramyakrishta,makar deshpande,uttej,sunaina  4న ఆకాష్ పూరి రొమాంటిక్
Romantic movie on 4th November 4న ఆకాష్ పూరి రొమాంటిక్
Advertisement
Ads by CJ

దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 4న విడుదలవుతున్న‌ ఆకాష్ పూరి రొమాంటిక్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్న‌ రొమాంటిక్ చిత్రం కోసం క‌థ‌, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్ తరువాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ సినిమా నుంచి స్పెష‌ల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్‌లో ఫారెన్ లొకేష‌న్‌లో కేతిక శర్మ వెనకాల ఆకాష్ పడుతున్నట్టుగా ఉంది. ఆకాష్ స్టైలీష్‌గా కనిపిస్తుండగా.. కేతిక శ‌ర్మ‌ అందంగా కనిపిస్తోంది. వీరిద్ద‌రి జంట మ‌నోహ‌రంగా ఉంది.

దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 4న విడుదల కానుంది. దీపావళి రేస్‌లో మొదటి చిత్రంగా రొమాంటిక్ నిలిచింది. సింగిల్‌ కట్ కూడా లేకుండా.. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌‌ను ఇచ్చారు. రమ్య‌కృష్ట ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునిల్ కశ్య‌ప్ సంగీతం అందించారు. న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాటలకు విశేష‌ స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన‌ అన్ని పోస్టర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాపై మంచి బ‌జ్‌ని క్రియేట్ చేశాయి.

తారాగ‌ణం: ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ట‌, మ‌క‌రంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్‌, సునైన‌.

Romantic movie on 4th November:

Akash Puri Romantic movie on 4th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ