Advertisementt

పెళ్లి సంద‌D నుంచి మధురానగరిలో యమునా తటిలో..

Wed 29th Sep 2021 07:37 PM
pelli sandhad,pelli sandhadi,pelli sandhad lyrical song,roshan,srilila,prakashraj,rajendra prasad,rao ramesh,tanikella bharani,posani krishna murali,wennela kishore,rajiv kankalam,srinivas reddy,  పెళ్లి సంద‌D నుంచి మధురానగరిలో యమునా తటిలో..
Pelli sandhaD lyrical song పెళ్లి సంద‌D నుంచి మధురానగరిలో యమునా తటిలో..
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా పెళ్లి సంద‌D చిత్రం నుంచి మధురానగరిలో యమునా తటిలో.. అనే లిరికల్ సాంగ్ విడుదల 

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం పెళ్లి సంద‌D. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన ఈయ‌న పెళ్లిసంద‌D లో అతిథి పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఈ చిత్రం నుంచి మధురానగరిలో యమునా తటిలో..  అనే లిరికల్ పాట‌ను మాస్ మహారాజా ర‌వితేజ విడుద‌ల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. 

మధురా నగరిలో, మయునా తటిలో..

మురళీ స్వరములే ముసిరిన ఎదలో..

కురిసెనంట మురిపాల వాన‌

ల‌య‌లై హోయ‌లై జ‌ల జ‌ల జ‌తులై.. గ‌ల గ‌ల గ‌తులై

అంటూ సాగే ఈ పాట‌లో ల‌వ్ సాంగ్‌.. రెండు వేరియేష‌న్స్‌లో సాగే ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శ్రీనిధి, నయ‌నా నాయ‌ర్‌, కాల భైర‌వ పాడారు. 

ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చాయి. అలాగే టీజ‌ర్‌, రీసెంట్‌గా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  ఇప్పుడు మధురానగరిలో అనే లిరికల్ సాంగ్ కూడా విడుదలైంది.

Pelli sandhaD lyrical song:

Pelli sandhaD lyrical song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ