Advertisementt

వరుడు కావలెను నుంచి బ్యూటిఫుల్ సాంగ్

Sat 02nd Oct 2021 11:02 AM
naga shaurya,ritu varma,varudu kaavalenu movie,naga shaurya and ritu varma,varudu kaavalenu song released  వరుడు కావలెను నుంచి బ్యూటిఫుల్ సాంగ్
Naga Shaurya and Ritu Varma Varudu Kaavalenu song released వరుడు కావలెను నుంచి బ్యూటిఫుల్ సాంగ్
Advertisement
Ads by CJ

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం వరుడు కావలెను నేడు (2-10-2021) వరుడు కావలెను‘ యూనిట్ చిత్రంలోని ఓ వీనుల విందైన గీతాన్ని విడుదల చేశారు. 

ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే కన్నుల పండుగ గా అ(క)నిపిస్తుంది. వివరాల్లోకి వెళితే…వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు ...వయ్యారం చిందేసే అందాల భామలు అంటూ సాగే ఈ గీతం రచయిత రఘురామ్ రచిం చారు. ఈ గీతాన్ని గాయనీ, గాయకులు శ్రీకృష్ణ, గీతామాధురి, ఎం ఎల్ గాయత్రి, అదితి భావరాజు, శ్రుతి రంజని లు వీనుల విందుగా ఆలపించారు. ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సమకూర్చిన సంగీతం  హుషారుగా సాగుతుంది. చిత్ర నాయకా నాయిక లు ‘నాగశౌర్య, రీతువర్మ‘ లతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా చిత్ర కథానుసారం ఓ పెళ్లి వేడుక నేపథ్యంలో  తెర రూపంగా  ఈ గీతం కనిపిస్తుంది. హుషారైన సంగీతం, చక్కని సాహిత్యం ఈ పాట సొంతం. వీటికి తోడు బృంద మాస్టర్ నృత్య రీతులు మరింత హుషారెత్తిస్తాయి.ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 15 న దసరా కానుకగా చిత్రం విడుదల.

naga shaurya,ritu varma,varudu kaavalenu movie,naga shaurya and ritu varma,varudu kaavalenu song releasednaga shaurya,ritu varma,varudu kaavalenu movie,naga shaurya and ritu varma,varudu kaavalenu song released

Naga Shaurya and Ritu Varma Varudu Kaavalenu song released:

The wedding ceremony song from Naga Shaurya and Ritu Varma Varudu Kaavalenu is released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ