Advertisementt

సీవీ రెడ్డి దర్శకత్వంలో ఆఖరి ముద్దు

Sat 02nd Oct 2021 03:17 PM
akhari muddu,director cv reddy,c v reddy,cee vee arts,akhari muddu movie,akhari muddu telugu movie,cv reddy photos  సీవీ రెడ్డి దర్శకత్వంలో ఆఖరి ముద్దు
Akhari Muddu Directed by CV Reddy సీవీ రెడ్డి దర్శకత్వంలో ఆఖరి ముద్దు
Advertisement
Ads by CJ

సీవీ రెడ్డి దర్శకత్వంలో ఆఖరి ముద్దు

నిర్మాత, దర్శకుడు సి వి రెడ్డి త్వరలో ఓక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలోచింపజేసే కథాంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీవీ ఆర్ట్స్ పై ఈ సినిమాను సీ. వి. రెడ్డి ఎనిమిది సంవత్సరాల తరువాత నిర్మిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఈ సినిమా కథను తయారు చేసుకున్న సీవీ రెడ్డి దీనికి ఆఖరి ముద్దు అన్న పేరు నిర్ణయించారు.

ఈ కథ తనని బాగా ప్రభావిత చేసిందని, ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుందని, డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సీవీ రెడ్డి తెలిపారు. గతంలో సీవీ రెడ్డి తెలుగులో పది చిత్రాలు, కన్నడ, తమిళం లో అనేక చిత్రాలు నిర్మించారు...

దర్శకుడుగా, రచయితగా, నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు నిర్మిచారు.. బదిలి అనే చిత్రం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు స్వీకరించారు. పెళ్లి గోల, విజయరామరాజు, శ్వేత నాగు, ఆడుతూ పడుతూ లాంటి సూపర్ హిట్ చిత్రాలను సివి. రెడ్డి నిర్మించారు. నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఇండియన్ పనోరమా కమిటీ మెంబెర్ గా, ప్రతిష్టాత్కమైన ఆస్కార్ కమిటీకి చైర్మన్ గా గౌరవ ప్రదమైన సేవలందించారు. ఆఖరి ముద్దు సినిమాకు  కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు, దర్శకత్వం వహిస్తూ తానె స్వయంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. 

Akhari Muddu Directed by CV Reddy :

Akhari Muddu Directed by CV Reddy 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ