Advertisementt

కమల్ హాసన్ విక్రమ్ సెకండ్ షెడ్యూల్ ఫినిష్

Sun 03rd Oct 2021 05:24 PM
kamal haasan,lokesh kanagaraj,vikram movie,vikram second schedule wrapped up  కమల్ హాసన్ విక్రమ్ సెకండ్ షెడ్యూల్ ఫినిష్
Kamal Haasan Vikram Second Schedule Wrapped Up కమల్ హాసన్ విక్రమ్ సెకండ్ షెడ్యూల్ ఫినిష్
Advertisement
Ads by CJ

యూనివర్సల్ హీరో  కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్‌  విక్రమ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్ హాసన్.  

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ భాగమవుతున్నారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన విక్రమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్రయూనిట్.. తాజాగా సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేశారు. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు.

విక్రమ్ సెకండ్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ అయిందని పేర్కొంటూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు కమల్ హాసన్ మడ్ బైక్‌పై కూర్చొని ఉన్న పిక్ షేర్ చేశారు. ఈ ఫొటోలో కమల్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్, స్టంట్ మాస్టర్ డుయో అన్బరీవ్ కనిపిస్తున్నారు.

Kamal Haasan Vikram Second Schedule Wrapped Up:

Kamal Haasan, Lokesh Kanagaraj Vikram Second Schedule Wrapped Up

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ