Advertisementt

హెడ్స్ అండ్ టేల్స్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేసిన రెజీనా

Fri 08th Oct 2021 07:50 PM
heads and tales,heads and tales firstlook,heads & tales,regina,suneel,sunil,sunil heads & tales  హెడ్స్ అండ్ టేల్స్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేసిన రెజీనా
Regina Released by Heads and Tales Firstlook హెడ్స్ అండ్ టేల్స్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేసిన రెజీనా
Advertisement
Ads by CJ

జీ5 ఒరిజినల్ మూవీ హెడ్స్ అండ్ టేల్స్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేసిన రెజీనా, అక్టోబర్ 22న నుండి జీ 5 ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానున్న సినిమా

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు.. ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక జీ 5. ఒక్క హిందీలో మాత్రమే కాదు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. లాక్‌డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లో జీ 5 ఉంటే చాలు.. వినోదానికి లోటు ఉండదు. గత ఏడాది అమృత రామమ్ నుండి మొదలుపెడితే 47 డేస్, మేకా సూరి, బట్టల రామస్వామి బయోపిక్కు, ఇటీవల నెట్, అలాంటి సిత్రాలు వరకూ ఎన్నో సినిమాలను జీ 5 డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. ప్రజల కోసం ప్రత్యేకంగా సినిమాలు అందిస్తోంది. తాజాగా హెడ్స్ అండ్ టేల్స్ ను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్ మూవీ హెడ్స్ అండ్ టేల్స్. కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22 నుండి జీ 5 ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుందీ సినిమా. ప్రముఖ కథానాయిక రెజీనా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తనకు నచ్చిందని ఆమె పేర్కొన్నారు. హెడ్స్ అండ్ టేల్స్ లో అనీషా పాత్రలో శ్రీవిద్య మహర్షి, మంగ పాత్రలో దివ్య శ్రీపాద నటించారు. మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది. గాళ్ ఫార్ములా యూట్యూబ్ ఛాన‌ల్‌లో కంటెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న శ్రీవిద్య-దివ్య ద్వయం మరోసారి ఈ సినిమాతో ప్రజల ముందుకొస్తున్నారు. 

హెడ్స్ అండ్ టేల్స్ గురించి మేకర్స్ మాట్లాడుతూ ఇదొక అందమైన కథ. ముగ్గురు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్కరూ జీవితంలో ఒక్కో దశలో ఉంటారు. జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి. అప్పుడు విధిరాత ఎలా రాసి ఉంది? ప్రతి మహిళకు భాగస్వామి పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉంది? అనేది కథ అని చెప్పారు. దర్శకుడు సాయికృష్ణ ఎన్రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క రాత్రిలో జరిగే కథతో హెడ్స్ అండ్ టేల్స్ తెరకెక్కించాం. జీవితంలో వివిధ దశల్లో ఉన్న మహిళలు సమస్యలను పరిష్కరించే విధానం వేరుగా ఉంటుంది. మహిళల కథతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి మహిళకు స్ఫూర్తినిస్తుంది. తమ కోసం, తమ హక్కుల కోసం నిలబడాలని చెబుతుంది. ఇందులో జీవిత తత్వమూ ఉంది. మనం ఆలోచించే దానికంటే విధితో మన జీవితాలు ఎక్కువ ముడిపడి ఉన్నాయని చెప్పే చిత్రమిది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడదగ్గ సినిమా ఇది అని అన్నారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది అని జీ 5 వర్గాలు తెలిపాయి.

Regina Released by Heads and Tales Firstlook :

Regina Cassandra unveils First look of Heads & Tales

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ