షూటింగ్ పూర్తి త్వరలో ఫస్ట్ లుక్
సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వా.ఆర్.రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ.. గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం గీత. మ్యూట్ విట్నెస్ అన్నది ఉప శీర్షిక. నిర్మాతగా ఆర్.రాచయ్య కిది తొలిచిత్రం. క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ హీరోగా నటిస్తుండగా.. నువ్వే కావాలి, ప్రేమించు చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంచలన దర్శకులు వి.వి.వినాయక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.
రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా.. ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం. సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్.కె, కూర్పు: ఉపేంద్ర, కో-డైరెక్టర్: వి.వి.రమణ, నిర్మాత: ఆర్.రాచయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వా.ఆర్.రావు.