Advertisementt

టీజర్ తగ్గేదే లే

Thu 14th Oct 2021 06:47 PM
taggede le,taggede le movie,taggede le movie teaser,naveen chandra,divya pillai,ananya senugupta,nagababu,ayyappa sharma,raja ravindra  టీజర్ తగ్గేదే లే
Taggede le teaser release టీజర్ తగ్గేదే లే
Advertisement
Ads by CJ

నవీన్ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు దర్శకత్వంలో భద్ర ప్రొడక్షన్స్‌ నిర్మించిన తగ్గేదే లే టీజర్ విడుదల

టాలీవుడ్‌లో భద్ర ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణ సంస్థగా అవతరించబోతోంది. విభిన్న చిత్రాలను భారీ బడ్జెట్‌లో నిర్మించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా వారి మొదటి చిత్రాన్ని నవీన్ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా తగ్గేదే లే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన  ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను గమనిస్తే.. సినిమా రస్టిక్ మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. నవీన్ చంద్ర ఓ అమ్మాయిని పెళ్లి  చేసుకుంటాడు. ప్లే బాయ్ పాత్రలో ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకునే కుర్రాడి కారెక్టర్‌లో కనిపించనున్నాడు.

ఇక మరో వైపు సిటీలో మర్డర్ గ్యాంగ్ ఉంటుంది. వారి కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఈ టీజర్‌లో సినిమాలో ముఖ్య పాత్రలన్ని కనిపిస్తాయి. ప్రతీ కేస్‌కు అంతం ఉంటుంది..నేరస్థులు చివరకు పట్టుబడతారు అనేదే తగ్గేదే లే కథ. రవిశంకర్ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయేలా ఉంది. దివ్యా పిళ్లై, అనన్య సేనుగుప్తా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, అయ్యప్ప శర్మ, నవీన్ చంద్ర, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్‌గా, చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. థియేటర్లో మాస్ అండ్ హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను ఇస్తుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.

నటీనటులు: నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేనుగుప్తా, నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, అయ్యప్ప శర్మ, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్.

సాంకేతిక బృందం: రచయిత, దర్శకత్వం: శ్రీనివాస్ రాజు, నిర్మాత: భద్ర ప్రొడక్షన్స్, సంగీతం: చరణ్ అర్జున్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజా రవీందర్, సినిమాటోగ్రఫర్: వెంకట్ ప్రసాద్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: చిన్నా, లిరిక్స్: భాస్కర భట్ల, రామ జోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్ మాస్టర్: వెంకట్, పీఆర్వో : వంశీ-శేఖర్.

Taggede le teaser release:

Taggede le movie teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ