Advertisementt

దసరా ఫెస్టివల్ మూవీ అప్ డేట్స్

Sat 16th Oct 2021 04:39 PM
dussehra festival,tollywood movie updates,adavallu meeku joharlu movie,peddanna movie,nani dasara movie,suhas movie opening,trisha movie  దసరా ఫెస్టివల్ మూవీ అప్ డేట్స్
Dussehra Festival movie updates దసరా ఫెస్టివల్ మూవీ అప్ డేట్స్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్, శివ, ఏసియన్ ఇన్‌ఫ్రా ఎస్టేట్ ఎల్ఎల్‌పి చిత్రం పెద్దన్న
తమిళంలో ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె అంటూ మాస్ యాక్షన్‌ను చూపించేందుకు రెడీ  అయ్యారు. టాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ అన్నాత్తె డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు.
దసరా సందర్భంగా తెలుగు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి తెలుగులో  పెద్దన్న అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం అన్నాచెల్లెళ్ల సంబంధం మీద తెరకెక్కుతుండటంతో పెద్దన్న అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలతో సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు మీద కత్తి పట్టుకుని రజనీకాంత్ తన మాస్ అవతరాన్ని చూపించారు. ఇందులో  హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నట్టు కనిపిస్తోంది. రజినీ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.
నిన్న విడుదల చేసిన తమిళ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోయింది. ఇక తెలుగు టీజర్ అతి త్వరలో రాబోతోంది.
రజనీకాంత్ సరసన నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. ఇమ్మాన్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
నవంబర్ 4న దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో పెద్దన్న రిలీజ్ కాబోతోంది.

శర్వానంద్, రష్మిక మందన్నా, తిరుమల కిషోర్, ఎస్ఎల్‌వీసీ ఆడవాళ్లు మీకు జోహార్లు ఫస్ట్ లుక్ విడుదల

శర్వానంద్ ఏ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ఓ కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ రాబోతోన్న ఈ మూవీని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. శర్వానంద్, కిషోర్ తిరుమల ఇద్దరూ కూడా ప్రస్తుతం కొత్త జానర్‌ను ట్రై చేస్తున్నారు.
దసరా కానుకగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను  విడుదల చేశారు. ఇక ఇంట్లో పండుగ వాతావరణాన్ని తలపించేలా.. గుమ్మానికి పూల తోరణాలు కట్టారు. రష్మిక, శర్వానంద్ ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లో ఈ జోడి ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తోంది.
ఆడవాళ్లు  మీకు  జోహార్లు అనే సినిమాతో శర్వానంద్ మొదటిసారిగా రష్మిక మందన్నా, కిషోర్ తిరుమలతో కలిసి పని చేస్తున్నారు. శర్వానంద్  ఈ చిత్రంలో పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నారు. రష్మిక అద్భుతమైన పాత్రను పోషిస్తోంది. టైటిల్‌ను బట్టి చూస్తే  ఈ చిత్రం మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తోంది.

జీఏ2పిక్చ‌ర్స్, స్వేచ్ఛ క్రియేష‌న్స్, వెంక‌టేశ్ మ‌హా నిర్మాణంలో సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ప్రారంభం
100 ప‌ర్సెంట్ ల‌వ్, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండ‌గే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని నిర్మించిన జీఏ2పిక్చ‌ర్స్ వారు వినూత్న‌మైన క‌థ‌ల్ని, నూత‌న ద‌ర్శ‌కుల్ని ప్రొత్స‌హించే క్ర‌మంలో భాగంగా రియలిస్టిక్ సినిమాల్ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న‌ వెంక‌టేశ్ మ‌హా స‌మ‌ర్ప‌కుడిగా క‌ల‌ర్ ఫొటో ఫేమ్ సుహాస్ హీరోగా తెర‌కెక్కిస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. ఈ సినిమాను జీఏ2పిక్చ‌ర్స్ వారు మ‌రో నిర్మాణ సంస్థ స్వేచ్ఛ క్రియేష‌న్స్ తో క‌లిసి నిర్మిస్తున్నారు. యువ నిర్మాత ధీర‌జ్ మోగిలినేని ఈ సినిమాను నూత‌న ద‌ర్శ‌కుడు ధుశ్యంత్ క‌టిక‌నేనితో క‌లిసి తెర‌కెక్కిస్తున్నారు. క‌ల‌ర్ ఫొటో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సుహాస్ ఈ సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధం అవుతున్నారు. హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో జ‌రిగిన ఈ సినిమా పూజాకార్య‌క్ర‌మానికి మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారు హాజ‌రై  క్లాప్ కొట్టారు, అనంత‌రం ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు స్క్రిప్ట్ ను అంద‌జేశారు. స్టార్ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేసి గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు.  ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే  అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర నిర్మాత ధీజ‌ర్ మోగిలినేని తెలిపారు.

వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎఫ్ 3 దసరా స్పెషల్ పోస్టర్ విడుదల.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్  2 ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇక దానికి సీక్వెల్‌గా  రాబోతోన్న ఎఫ్ 3 చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. థియేటర్లో నవ్వుల ఝల్లు కురిపించేలా ఈ సారి కామెడీ డోస్ పెంచుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.
టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎఫ్ 3 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దిల్  రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తమన్నా భాటియా, మెహరీన్ పిర్జాడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతోన్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో సుధీర్ఘ షెడ్యూల్‌ను చిత్రయూనిట్ నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు నటీనటులందరూ పాల్గొంటున్నారు.
దసరా సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి  స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పోస్టర్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు తమ తమ స్టైల్లో అదరగొట్టేశారు.
చిత్రయూనిట్ విడుదల చేసిన ఈ వీడియోలో అందరూ దసరా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ వీడియోను చూస్తుంటే సెట్‌లో ఎంతటి సందడి వాతావరణం ఉందో తెలుస్తోంది.

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో  ఎస్ఎల్‌వీసీ పతాకంపై రూపొందుతున్న దసరా మూవీ గ్లింప్స్  విడుదల
నేచురల్ స్టార్ నాని చేసే ప్రతీ సినిమా, ఎంచుకునే ప్రతీ పాత్ర కొత్తగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నాని ఎంచుకున్న కారెక్టర్ మాత్రం ఇది వరకు ఎన్నడూ చూడనిది. ఈ దసరా సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్‌తో నాని అందరినీ ఆశ్చర్యపరిచారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతోన్న నాని కొత్త సినిమాకు దసరా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు పొందిన మహానటి కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
దసరా సందర్భంగా పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని నేపథ్యం, కాన్సెప్ట్‌ను ఎలా ఉంటుందో ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఇందులో నాని, కీర్తి సురేష్ లుక్ ఎలా ఉంటుందో చూపించారు. ఒకప్పటి కాలంలోని రైళ్లు, ఆ ట్రాక్, బతుకమ్మ పాట ఇలా అన్నింటిని చూస్తుంటే ఇది పక్కా తెలంగాణ భాష, యాసలో తెరకెక్కిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక చివర్లో  నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.
ఈ చిత్రం గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని ఇది వరకు ఎన్నడూ చూడని కొత్త అవతారంలో  కనిపించబోతోన్నారు.
సముద్రఖని, సాయి కుమార్, జరినా వాహబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు.
నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్వయహరిస్తున్నారు. విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దసరా యూనిట్‌కు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

త్రిష, సూర్య వంగల, అవినాష్ కొల్ల, సోని లివ్ వెబ్ సిరీస్ బృందా లాంఛనంగా ప్రారంభం
ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లకు టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. అవినాష్ కొల్ల ఇప్పుడు తన సోదరుడు అశోక్ కొల్లతో కలిసి కొత్త ప్రొడక్షన్ కంపెనీ అండ్ స్టోరీస్ (&Stories)ను ప్రారంభించారు.
సోనీ లివ్ ఓటీటీ ఫ్లాట్ ఫాంతో కలిసి తమ మొదటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. త్రిష హీరోయిన్‌గా బృందా అనే టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతోన్నారు. త్రిష కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సరైన కథ కోసం వేచి చూస్తున్నారు. తనకు నచ్చిన స్క్రిప్ట్ దొరకడంతో ఇలా ఓటీటీ బాట పట్టేశారు.
దసరా సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలను నేడు నిర్వహించారు.
సోనీ లివ్ మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను చేస్తోంది. అది కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రాబోతోన్న అద్భుతమైన కథతో సోనీ లివ్ రాబోతోంది. సూర్య వంగల ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. దినేష్ కే బాబు కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
జై కృష్ణ ఈ వెబ్ సిరీస్‌కు మాటలు అందిస్తున్నారు. పద్మావతి మల్లాదితో కలిసి సూర్య వంగల స్క్రీన్ ప్లే రాసుకున్నారు. శశాంక్ వెన్నెలకంటి స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు.

Dussehra Festival movie updates:

Dussehra Festival movie updates 2021

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ