Advertisementt

సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తాం: రామ్ చరణ్

Sun 17th Oct 2021 12:11 PM
ram charan,sandhya raj,natyam pre release event,ram charan at natyam pre release event  సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తాం: రామ్ చరణ్
Natyam Pre release event సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తాం: రామ్ చరణ్
Advertisement
Ads by CJ

ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా నాట్యం. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం గ్రాండ్‌గా హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిధిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 

రోహిత్ మాట్లాడుతూ.. మా చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన రామ్ చరణ్ గారికి థ్యాంక్స్. ఆయన్ను కలుస్తున్నానంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు రేవంత్‌కు థ్యాంక్స్. సంధ్యరాజు గారి వల్లే నేను ఈ రోజు ఇక్కడున్నాను. నేను తెలుగు నేర్చుకున్నాను. నాట్యం టీం నన్ను ఎంతో బాగా చూసుకుంది. ఈ సినిమా మొత్తానికి విడుదల కాబోతోంది. వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మీ అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

పాటల రచయిత కరుణాకర్ మాట్లాడుతూ.. నాట్యం సినిమాకు అన్ని పాటలు రాసే అవకాశం వచ్చింది. దర్శకుడు రేవంత్ ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పటికే మీకు ఈ చిత్రం ఎంతో స్పెషల్ అని అర్థమై ఉంటుంది. ఇలాంటి ఓ సినిమాకు రేవంత్ ఎంతో మందిని తీసుకోగలరు. కానీ నన్ను తీసుకున్నారు. నాపై నమ్మకం ఉంచి నాకు అవకాశం ఇచ్చారు. ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయాలని అంతా అనుకుంటారు. నాకు అలాంటి అవకాశం నాట్యం సినిమాతో వచ్చింది. ప్రతీ ఒక్క సందర్భం ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. అలాంటి సన్నివేశాలను క్రియేట్ చేసి నాతో ఇంత బాగా రాయించుకున్నందుకు థ్యాంక్స్. పాటలు రాసేటప్పుడు సంధ్యారాజు గారు, రేవంత్ గారు అందరం కలిసి చర్చించుకునేవాళ్లం. ఇందులో నేను నటించేలా ఒత్తిడి తెచ్చారు. ఇందులో నాచేత డ్యాన్స్ కూడా చేయించారు. శ్రవణ్ భరద్వాజ్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రేవంత్‌కు తెలుగు రాకపోయినా ఎంతో కష్టపడి నేర్చుకుని డైలాగ్స్ చెప్పారు. సంధ్యారాజు గారి నటన, ఆమె డ్యాన్స్‌లను తెరపై చూస్తాం. మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. 

నందినీ రెడ్డి మాట్లాడుతూ.. మంచి కథ చెప్పాలంటే.. బలమైన కారణం ఉండాలి. ఈ సినిమా వెనకాల సంధ్య రాజు గారి డ్యాన్స్ పట్ల ఉన్న ప్రేమ, ఆరాధన కనిపిస్తోంది.  ఇలాంటి సమయంలో ఇలాంటి కళాత్మక  చిత్రాలు  రావడం సంతోషంగా ఉంది. రామ్ చరణ్ గారు ఈ ఈవెంట్‌కు రావడం వల్ల ఇంకా ఎంతో మందికి రీచ్ అవుతుంది. అదే ఈ సినిమాకు కావాలి. సినిమాను చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం అందరికీ మెమోరబుల్ అవ్వాలని కోరుకున్నారు.

స్వప్నాదత్ మాట్లాడుతూ.. నాకు చాలా ఏళ్ల నుంచి సంధ్య గారు తెలుసు. ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చి నాట్యం సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమెకు కళ పట్ల ఉన్న ప్యాషన్, డెడికేషన్ వల్లే అందరూ సపోర్ట్  చేస్తున్నారు. ఇలాంటి చిత్రాలను ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ లేకపోతే నేను దర్శకుడి అయ్యేవాడిని కాదు. ఇలాంటి సినిమాకు  శ్రవణ్ పని చేస్తున్నాడని తెలిసి ఎంతో సంతోషించాను. రేవంత్, శ్రవణ్ ఈ సినిమాకు రెండేళ్లుగా కలిసి పని చేస్తున్నారు. సంధ్యా రాజు గారి డ్యాన్స్‌ నాకు చాలా ఇష్టం. ఇలాంటి సినిమా వస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రేవంత్ నా దగ్గరి వచ్చి కథ చెప్పినప్పుడు ఎలా చేయాలి? అని భయపడ్డాను. కానీ రేవంత్, సంధ్యా రాజు గారు వచ్చి వివరించి చెప్పడంతో ఎంతో పరిశోధించి చేశాను. నా టీం లేకపోతే  ఇదంతా సాధ్యమయ్యేది కాదు. సింగర్లంతా కూడా ఓన్ చేసుకుని పాటలు పాడారు. ఈ చిత్రం మొదలవ్వడానికి కారణం రేవంత్. ఆయన నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. ఆయనకు ఎంతో ఓపిక. సంధ్యారాజు గారి నటన, నాట్యం ఊహకు మించి ఉంది. రోహిత్ గారు కూడా అద్బుతంగా నటించారు అని అన్నారు.

ఆదిత్య మీనన్ మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు విలన్ పాత్రలు వేశాను. కానీ ఓ సారి దర్శకుడు రేవంత్ వచ్చి డ్యాన్స్ గురువు పాత్ర వేయాలని చెప్పాడు. నా మీద నమ్మకం లేదు. కానీ రేవంత్ నన్ను నమ్మారు. ఆయనకు థ్యాంక్స్. ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సంధ్యారాజు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. రోహిత్ తెలుగు నేర్చుకుని డైలాగ్స్ చెప్పారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదించాలి అని అన్నారు.

కొరియోగ్రఫర్ మనోజ్ఞ మాట్లాడుతూ.. నాట్యం అంటే ఓ కథను అందంగా చెప్పడం. ఇదే మనసులో అనుకుని వచ్చాం. సంధ్యాగారు, రోహిత్ గారు అలాంటి అవకాశం ఇచ్చి ఎక్స్‌ప్లోర్ చేశారు. వారిద్దరికి థ్యాంక్స్. రామ్ చరణ్ గారి ముందు ఇలా పర్ఫామ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నాట్యం సినిమా చాలా బాగుంటుంది. టికెట్ కొని థియేటర్లో సినిమా చూడండి అని అన్నారు.

డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ.. ఇంద్ర సినిమాకు లైన్‌లో నిల్చుని మొదటి టికెట్‌కు కొన్నాను. అలాంటిది నేను చిరంజీవి గారికి నా సినిమాను చూపించాను. నాట్యం సినిమా తీశాను. కానీ చిరంజీవిని కలవడమే నాకు అతి పెద్ద అచ్చీవ్‌మెంట్. నా టీం గురించి చాలా చెప్పాలి. సక్సెస్ పార్టీలో అందరి గురించి మాట్లాడతాను.  ఎంతో ఓపికతో నాతో జర్నీ చేసినందుకు చాలా థ్యాంక్స్. నా బదులు మా అక్క ఇంటి బాధ్యతను తీసుకున్నారు. నాకు అంత మంచి ఫ్యామిలీ దొరికింది. 2010 నుంచి నన్ను రామ్ చరణ్ సపోర్ట్ చేస్తున్నారు. మొదటిసారిగా ఆయన వల్లే నాకు గుర్తింపు వచ్చింది. నేను చేసిన ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఎవడు సినిమా ఫంక్షన్‌లో ఓ అభిమానిలా అరిచాను. నేను కూడా ఏదో ఒక రోజు స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడాలని అనుకున్నాను. అది ఈ రోజు వచ్చింది. ఈ స్థాయికి రావడానికి నాకు పదేళ్లు పట్టింది. మంచి సినిమా తీయడం కోసం ఇన్నేళ్లు ఎదురుచూశాను. మంచి తెలుగు సినిమా తీశాను. తెలుగుదనం ఉన్న సినిమాను తీశాను. సినిమాకు శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. డిఫరెంట్ సినిమాను తీశాను. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని నాకు చాలా భయంగా ఉంది. కానీ జనాలు ఇలాంటి వాటిని ఆదరిస్తే ఇంకా  కొత్త సినిమాలు వస్తాయి. దయచేసి అందరూ సినిమాను ఆదరించండి అని అన్నారు.

సంధ్యా రాజు మాట్లాడుతూ.. నేను ఏదైనా మాట్లాడే ముందు మా గురువు వెంపటి చినసత్యం గారిని గుర్తుకు చేసుకోవాలి. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. రామ్ చరణ్ గారు ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన నాకు గత పదేళ్లుగా సాయం చేస్తూనే ఉన్నారు. ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను.  నాట్యం సినిమా నా గురించి కాదు.. రేవంత్ గురించి కాదు. వెనకాల ఎంతో మంది శ్రమ ఉంది. మంచి మ్యూజిక్ ఇచ్చిన శ్రవణ్ గారికి థ్యాంక్స్. నా గురువు గారంటే నాకు ప్రాణం.. ఆదిత్య గారు ఆ పాత్రను పోషించడంతో మీరు కూడా నాకు ఎంతో స్పెషల్. కమల్ గారికి క్లాసికల్ డ్యాన్స్ రాదు. కానీ సినిమా కోసం ఏడాది పాటు నా వద్ద నేర్చుకున్నారు. ఆయనే బాగా చేశారని అందరూ అన్నారు. కరుణాకర్ అద్భుతంగా  పాటలు రాశారు. నాట్యం సినిమాను అక్టోబర్ 22న తప్పకుండా చూడండి అని అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. మా సినిమాలు ఆలస్యమైనా కూడా అభిమానులు ఎప్పుడూ ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. మా అభిమానులే అని కాదు సినిమా అభిమానులంతా కూడా ఎదురుచూస్తున్నారు. మళ్లీ మన ఇండస్ట్రీకి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను. సంధ్యారాజు గారు మా ఫ్యామిలీకి తెలుసు కాబట్టి ఇక్కడకు రాలేదు. మొన్నే సినిమాను చూశాను. మొదటి క్షణం నుంచి ఆఖరి నిమిషం వరకు ఎంతో అద్భుతంగా ఉంది. ఇండస్ట్రీ హిట్ సినిమాలను కూడా చూస్తూ మద్యలో పడుకుంటాను. అలాంటి నేను నాట్యం సినిమాను ఎంతో ఆసక్తిగా చూశాను. అన్ని కోణాల్లో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. అలాంటి ప్రయత్నం చేసిన రేవంత్‌ను అభినందిస్తున్నాను. రేవంత్‌ భవిష్యత్తులో ఇండస్ట్రీకి పెద్ద బలంగా మారుతాడనే నమ్మకం ఉంది. బాహుబలిలోని హంస అనే పాటకు దగ్గరగా తీశాడు. అన్ని పాటలు వినడానికి అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ సినిమాకు మ్యూజిక్ ప్లస్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి చిత్రాలకు మ్యూజిక్ ఎంతో ముఖ్యం. శ్రవణ్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రాణం పెట్టి, కథను అర్థం చేసుకుని మ్యూజిక్ ఇచ్చారు. కరుణాకర్  పాటలను అద్భుతంగా రాశారు. ఆదిత్య గారిని ఎన్నో పాత్రల్లో చూశాం. కానీ ఇలా తండ్రి, గురువు పాత్రలో కొత్తగా కనిపిస్తారు. ఇదే స్టేజ్‌లో సంధ్యా రాజు గారు దాదాపు ఏడేళ్ల క్రితం కూచిపూడి పర్ఫామెన్స్ చేశారు. కూచిపూడి నాట్యం, ఇలాంటి కల్చర్ మీద సినిమా తీస్తున్నారని సాయం చేసేందుకు వచ్చాను. మేం 20 మంది కలిసి సినిమా తీస్తే.. ఒకే ఒక అమ్మాయి ఇలాంటి  సినిమాను తీసి సాధించారు. స్త్రీ శక్తి అంటే ఏంటో ఈ సినిమాతో చూడబోతోన్నారు. ఈ సినిమా తరువాత మీకంటూ ఓ నిర్మాత, దర్శకులు రావాలని అనుకుంటున్నాను. నిర్మాతగా సినిమాలు తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. సంధ్యా రాజు గారి సంకల్పం కోసం ఈ సినిమాను మనం చూడాలి. సంకల్పం ఎంత గట్టిగా ఉంటే మన లక్ష్యాలు నెరవేరుతాయి. ఇద్దరి సంకల్పం ఎంత గట్టిగా ఉందో చెప్పడానికి ఈ సినిమా నిదర్శనం. అక్టోబర్ 22న ఈ చిత్రం రాబోతోంది. సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తాం. రెస్టారెంట్లు,బార్లు అన్ని చోట్లకు వెళ్తున్నాం. థియేటర్లకు కూడా వెళ్దాం. మళ్లీ మన థియేటర్లకు పూర్వ వైభవం తీసుకొద్దాం. అఖిల్ సినిమా హిట్ట్ అయిందని విన్నాను. ఇంకా చాలా చాలా సినిమాలు రాబోతోన్నాయి. కేవలం భరతనాట్యం గురించి మాత్రమే కాకుండా.. అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. దాని కోసం ఈ చిత్రం చూడాలి. అమ్మాయి సంకల్పం, అబ్బాయి కష్టపడ్డ విధానానికి అందరం సినిమా చూడాలి అని అన్నారు.

Natyam Pre release event:

Ram Charan at Natyam Pre release event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ