Advertisementt

నవంబర్ లో కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి

Sun 17th Oct 2021 04:37 PM
good luck sakhi,keerthy suresh,keerthy suresh,good luck sakhi wishes keerthy suresh  నవంబర్ లో కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి
Good Luck Sakhi releasing in November నవంబర్ లో కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి
Advertisement
Ads by CJ

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను అల‌రించ‌నున్నారు. ఈ క్రమంలోనే గుడ్ లక్ సఖి సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోన్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రావ్యా వర్మ సహ నిర్మాతగా ఈ చిత్రం రాబోతోంది.

నేడు (అక్టోబర్ 17) కీర్తి సురేష్ బర్త్ డే. ఈ క్రమంలో గుడ్ లక్ సఖి టీం నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. గురి చూసి కొడుతున్నట్టుగా ఉన్న కీర్తి సురేష్ పోస్టర్‌లో క‌నిపిస్తున్నారు. గన్నుతో గురి చూసి కొడుతున్న కీర్తి సురేష్ అభిమానులను కట్టిపడేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా నటించారు.

నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టు ఈ కొత్త పోస్టర్‌ ద్వారా ప్రకటించారు.

నాగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఒకే సారి విడుదలచేయబోతోన్నారు.

దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ మీద సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. చిరంతన్ దాస్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

Good Luck Sakhi releasing in November:

Good Luck Sakhi wishes Keerthy Suresh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ